అక్టోబర్ 2021 నుండి స్క్రాప్‌లను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 1,163 కోట్లను ఆర్జించింది. ముఖ్యంగా, ఈ మొత్తం రెండు చంద్రయాన్-3 మిషన్‌లకు నిధులు సమకూర్చిన నిధులతో సమానంగా ఉండడం విశేషం. ఒక్క చంద్రయాన్ మిషన్‌కు దాదాపు 600 కోట్లు ఖర్చవుతుంది.
న్యూఢిల్లీ : ప్రభుత్వ తాజా నివేదిక ముక్కున వేలేసుకుని ఔరా అనిపించేలా ఉంది. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోయేలా కనిపిస్తుంది. ఈ నివేదికల ప్రకారం, అక్టోబర్ 2021 నుండి స్క్రాప్‌లను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 1,163 కోట్లను ఆర్జించింది. ఇందులో ఈ ఏడాది అక్టోబర్.. ఒక నెలలోనే రూ. 557 కోట్లు వచ్చాయి.
ప్రభుత్వ నివేదిక ప్రకారం, అక్టోబర్ 2021 నుండి ప్రభుత్వ కార్యాలయాల్లో 96 లక్షల ఫైళ్లను తొలగించారు. వీటన్నింటినీ ఈ ఫైల్స్ గా మార్చారు. దీంతో దాదాపు 355 లక్షల చదరపు అడుగుల స్థలం కూడా ఖాళీ అయిందని న్యూస్18 సమచారం. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు నీట్ గా కనిపిస్తున్నాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఖాళీ స్థలాన్ని ఇతర ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నాయి.
కరోనాతో దేశవ్యాప్తంగా ఒకేరోజు ఆరుగురు మృతి... ఢిల్లీలో JN.1 మొదటి కేసు...
ట్రెండింగ్‌లో చెత్త అమ్మకం..
ఆసక్తికరమైన విషయమేమిటంటే, చంద్రయాన్-3 బడ్జెట్ కంటే దాదాపు రెట్టింపు మొత్తాన్ని ఈ చెత్త అమ్మకం ద్వారా మోడీ ప్రభుత్వం సంపాదించడం. చంద్రయాన్ 3కి ఖర్చు దాదాపు రూ. 600 కోట్లు. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రభుత్వంలోకి వివిధ శాఖల్లో పేరుకు పోయిన ఫైల్‌లు, కార్యాలయ సామగ్రి, వాడుకలో లేని వాహనాలు వంటి స్క్రాప్‌లను విక్రయించడం ద్వారా అటువంటి రెండు మిషన్‌లకు సరిపోయే నిధులు సమకూర్చవచ్చని తెలుస్తోంది.
“రూ. 16,000 కోట్లతో చేసిన రష్యా మూన్ మిషన్ ఫెయిల్ అయ్యింది. భారత్ చేసిన చంద్రయాన్-3 మిషన్‌కు కేవలం రూ. 600 కోట్లు ఖర్చయ్యాయి. చంద్రుడిపై ప్రయాణం, అంతరిక్ష యాత్రల లాంటి వాటితో హాలీవుడ్ చిత్రాలకు 600 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుంది”అని ఈ సంవత్సరం ప్రారంభంలో అంతరిక్ష పరిశోధన నిపుణులు తెలిపారు.
అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్‌మెంట్ నేతృత్వంలో ఈ భారీ డ్రైవ్ జరిగింది. ముఖ్యంగా, ఈ భారీ డ్రైవ్ కేంద్ర ప్రభుత్వ పరిశుభ్రత డ్రైవ్ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. దీనికి ప్రధానమంత్రి ప్రత్యక్షంగా సహకరించారు.
“స్పెషల్ క్యాంపెయిన్ 3.0 అనేది స్వచ్ఛత (పరిశుభ్రత)ని సంస్థాగతీకరించడం,పెండెన్సీని తగ్గించడం, కార్యాలయ స్థలాలలో స్వచ్ఛతలాంటి వాటికోసం భారత్ చేపట్టిన అతిపెద్ద ప్రచారం ఇది. భారత్, విదేశాల్లోని భారత కార్యాలయాలు మొత్తంగా 2,58,673 కార్యాలయాల్లో నెల రోజుల పాటు నిర్వహించిన ప్రచారం ఫలితంగా 164 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని ఖాళీ చేయడం, 24.07 లక్షల భౌతిక ఫైళ్లను తొలగించడం, ఆఫీస్ స్క్రాప్ పారవేయడం ద్వారా రూ. 556.35 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది” అని డీఏఆర్పీజీ కార్యదర్శి వి శ్రీనివాస్ తెలిపారు.
“ప్రజా ఫిర్యాదులు, రికార్డుల నిర్వహణ పద్ధతులు, ఎంపీల ఉత్తరాలకు ప్రత్యుత్తరాల పరిష్కారంలో మంత్రిత్వ శాఖలు/విభాగాలు దాదాపు 100 శాతం లక్ష్యాలను సాధించింది. దీంతో పెండింగ్ పనులు గణనీయంగా తగ్గడంతో ప్రత్యేక ప్రచారం 3.0 విజయవంతమైంది. స్వచ్ఛత అసెస్‌మెంట్ రిపోర్ట్ 2023, ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ప్రత్యేక ప్రచార 3.0ని విజయవంతంగా అమలు చేయడంలో, ఉత్తమ పద్ధతులు, ఆవిష్కరణలను డాక్యుమెంట్ చేయడంలో మంత్రుల మండలి, జీఓఐ కార్యదర్శులు పోషించిన నాయకత్వ పాత్రను అందజేస్తుంది. ఇకపై స్వచ్ఛతా ప్రచార పద్ధతులు ప్రభుత్వంలో సంస్థాగతీకరించబడతాయి, వారానికి మూడు గంటలు స్వచ్ఛత కార్యకలాపాలకు కేటాయించబడతాయి”అన్నారాయన.