క్రిమినల్ చట్టాల సమూల మార్పులకు కేంద్రం 3 బిల్లులు.. ఏ మార్పులు జరగనున్నాయంటే ?

Published : Aug 11, 2023, 02:23 PM IST
క్రిమినల్ చట్టాల సమూల మార్పులకు కేంద్రం 3 బిల్లులు.. ఏ మార్పులు జరగనున్నాయంటే ?

సారాంశం

కేంద్ర ప్రభుత్వం దేశంలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. దీని కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టారు. కొత్త బిల్లులతో శిక్షలు కాకుండా న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా హోం మంత్రి అన్నారు.

దేశంలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను సమూలంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన మూడు బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఈ బిల్లులను తీసుకొచ్చారు. ఇవి శిక్షించడానికి కావని, న్యాయం చేయడమే వాటి ఉద్దేశమని లోక్ సభలో ఈ బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా  అమిత్ షా  అన్నారు.

ఎన్నికల ఏడాదిలో ఈసీపై నియంత్రణ సాధించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది - కాంగ్రెస్

భారతీయ న్యాయ సంహిత - 2023, భారతీయ నగరిక్ సురక్షా సంహిత - 2023, భారతీయ సక్ష బిల్లు - 2023లను తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ ప్యానెల్ కు వెల్లడించనున్నట్టు అమిత్ షా వెల్లడించారు. ‘‘కొత్త బిల్లుల లక్ష్యం శిక్షించడం కాదు. న్యాయం చేయడం. నేరాలను అరికట్టాలనే భావన కలిగించేందుకు శిక్షలు విధిస్తాం’ అని చెప్పారు. 

ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి మాట్లాడుతూ.. రాజద్రోహ చట్టాన్ని రద్దు చేసినట్లు హోంమంత్రి ప్రకటించారు. ‘‘ప్రతిపాదిత చట్టంలో 'రాజద్రోహం' అనే పదం లేదు. భారత సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు విఘాతం కలిగించే చర్యలకు సెక్షన్ 150ని ప్రవేశపెట్టారు’’ అని ఆయన అన్నారు.

పాదచారిని ఢీకొట్టిన కారు.. నాలాలో పడి చనిపోయిన బాధితుడు.. 36 గంటల తరువాత మృతదేహం బయటకు..

దేశద్రోహం కేసులో శిక్షలో మార్పులు చేస్తున్నట్లు అమిత్ షా ప్రకటించారు. ప్రస్తుత చట్టం ప్రకారం రాజద్రోహానికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. దీన్ని మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్షగా మార్చాలని కొత్త బిల్లులో ప్రతిపాదించారు.

మూకదాడుల కేసుల్లో మరణశిక్ష విధించే నిబంధనను కేంద్రం ప్రవేశపెడుతుందని పార్లమెంటులో ఆయన వెల్లడించారు. మైనర్లపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించే నిబంధనలు కూడా కొత్త బిల్లులో ఉంటాయని ఆయన ప్రకటించారు.

మణిపూర్ హింస.. మహిళల స్వేచ్ఛ కోసం మోడీ పోరాడుతారన్న మేరీ మిల్బెన్.. ఇంతకీ ఆమె ఎవరంటే ?

కాగా.. కొత్త చట్టాల్లో  'జీవిత ఖైదు' అనే పదాన్ని  'సహజ జీవితానికి జైలు శిక్ష' అని నిర్వచించారు. దీని ప్రకారం.. దోషులకు పదేళ్లకు తగ్గకుండా కఠిన కారాగార శిక్ష విధించాలని, జీవిత ఖైదు వరకు పొడిగించవచ్చని, అంటే ఆ వ్యక్తి సహజ జీవితంలో మిగిలిన కాలం జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించాలని కొత్త చట్టం ప్రతిపాదించింది. అత్యాచార బాధితుల గుర్తింపును బహిర్గతం చేసినందుకు శిక్ష విధించే నిబంధనలు కూడా ఇందులో ఉన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్