CDS Gen Bipin Rawat: నేడు బిపిన్ రావత్ అంత్యక్రియలు.. హాజ‌రు కానున్న‌ శ్రీలంక, నేపాల్, భూటాన్ ఆర్మీఅధికారులు

By Rajesh KFirst Published Dec 10, 2021, 10:04 AM IST
Highlights

CDS బిపిన్‌ రావత్‌ దంపతుల అంత్యక్రియలు ఢిల్లీలో ఇవాళ జరగనున్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్​లోని బ్రార్ స్క్వేర్​ స్మశానవాటికలో వీరికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. రావ‌త్ అంతక్రియ‌ల‌కు శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌ ఆర్మీ అధికారులుహాజరు కానున్నారు.
 

CDS Gen Bipin Rawat:  భారత ఆర్మీ చరిత్ర‌లో ప్రఖ్యాతి గాంచిన వీర యోధుడు తొలి సీడీఎస్‌(చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) బిపిన్‌ రావత్  హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాశారు. తమిళనాడులోని నీలగిరి జిల్లా కున్నూర్ సమీపంలో  ప్రమాదంలో చోటు చేసుకుంది.  ఈ ఘ‌ట‌న‌లో  త్రిదళాధిపతి (సీడీఎస్​) జనరల్ బిపిన్ రావత్​, ఆయన సతీమణి మధులికతో పాటు 11మంది సైనికాధికారులు సైతం దుర్మరణం చెందారు. ఒక్కరు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నేడు బిపిన్‌ రావత్‌ దంపతుల అంత్యక్రియలు ఢిల్లీలో ఇవాళ జరగనున్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్​లోని బ్రార్ స్క్వేర్​ స్మశానవాటికలో వీరికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

దేశ సైనిక బలగాలకు కొత్త రూపుతెచ్చిన రావత్ ఆక‌స్మిక మరణంతో దేశం దిగ్భ్రాంతి చెందింది. పలువురు ప్రముఖులు ఆయన మరణంపై తీవ్ర సంతాపం ప్రకటించారు.  జనరల్ బిపిన్ రావత్​, మధులికా రావత్​ల భౌతిక దేహాలను గురువారం సాయంత్రం తమిళనాడు నుంచి సైనిక విమానంలో ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం వారి నివాసంలోనే భౌతిక దేహాలను ఉంచారు.

Read Also: https://telugu.asianetnews.com/international/number-of-journalists-jailed-reached-global-high-in-2021-cpj-report-r3vthx

అంతిమ యాత్ర ఇలా..

రావత్ దంప‌తుల పార్దీవ దేహాల‌ను చూడటానికి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సాధారణ ప్రజలు సందర్శించేందుకు వీలు కల్పించనున్నారు. ఆ తర్వాత 2 గంటల నుంచి రావత్‌ దంపతులఅంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఈ అంతిమ యాత్ర‌.. కామరాజ్ మార్గ్ ద్వారా కంటోన్మెంట్​లోని స్మశాన వాటిక వరకు  సాగుతోంది. సైనిక లాంఛనాలతో బిపిన్‌రావత్‌ దంపతుల అంత్యక్రియలు జ‌రుగ‌నున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రావ‌త్ అంతక్రియ‌ల‌కు శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌ ఆర్మీ అధికారులుహాజరు కానున్నారు.

ప్రముఖుల నివాళి..

సీడీఎస్​ బిపిన్ రావత్​ సహా ప్రమాదంలో మృతి చెందిన వారందరికి ప్రధాని మోడీ, కేంద్ర‌మంతులు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ (Defence Minister Rajnath Singh), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్​, సీఎం స్టాలిన్​, తెలంగాణ గవర్నర్ తమిళిసై, ఐఏఎఫ్​ చీఫ్​ మర్షల్ వివేక్ చౌధరీ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించారు. అమరుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు ప్రధాని మోడీ.

Read Also: https://telugu.asianetnews.com/national/bodies-of-cds-bipin-rawat-wife-and-others-reach-delhi-pm-narendra-modi-to-pay-tribute-r3uv01

ఈ ప్ర‌మాదంలో మొత్తం 13 మంది మ‌ర‌ణించగా.. ఒక్కరు మాత్రం తీవ్ర గాయాలతో బయటప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి కూడా విష‌యంగా ఉంది. ఆర్మీ హాస్పిటల్​లో చికిత్స కొనసాగుతోంది. అస‌లు ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై ఇప్పటికే ఐఏఎఫ్ సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది. ఇప్ప‌టికే ఆర్మీ అధికారులు హెలికాప్టర్​ బ్లాక్​ బాక్స్​ను స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే ప్రమాదానికి కార‌ణాలు వెలువ‌డ‌నున్నాయి.  

ఇదిలా ఉంటే.. ఈ ప్ర‌మాదంలో తెలుగు సైనికుడు సాయితేజ కూడా మ‌ర‌ణించారు. ఆయ‌న భౌతికకాయానికి డీఎన్‌ఏ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇప్పటికే సాయితేజ కుటుంబసభ్యుల శాంపిల్స్‌ను సేకరించారు. ఎన్‌ఏ పరీక్షల అనంతరం లాన్స్‌నాయక్‌ బి.సాయితేజ స్వగ్రామం ఎగువరేగడ పల్లె లో సైనిక లాంచనాలతో సాయితేజ అంత్యక్రియలు నిర్వహిస్తారు.

click me!