జార్ఖండ్‌లో జడ్జి అనుమానాస్పద మృతి: సుప్రీంకోర్టులో ప్రస్తావన, పోలీసుల దర్యాప్తు

By narsimha lodeFirst Published Jul 29, 2021, 12:37 PM IST
Highlights

జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్ అదనపు జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ మరణం అనుమానాలకు తావిస్తోంది. ఉద్దేశ్యపూర్వకంగానే ఆయనను వాహనంతో ఢీకొట్టి చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ  విషయమై సుప్రీంకోర్టులో కూడ ప్రస్తావించారు.


ధన్‌బాద్: జార్ఖండ్ రాష్ట్రంలో  ఉత్తమ్ ఆనంద్ అనే జడ్జి మరణంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. బుధవారం నాడు మార్నింగ వాక్ కు వెళ్లిన ఆయనను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.సుప్రీంకోర్టులో ఈ ఘటన గురించి ప్రస్తావించినప్పుడు సీజేఐ ఎన్వీ రమణ స్పందించారు. తాను జార్ఖండ్ ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడానని ఎన్వీ రమణ చెప్పారు.ధన్‌బాద్ జిల్లా అదనపు జిల్లా జడ్జి ను ఢీకొన్ని వాహనం డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు.

బుధవారం నాడు తన ఇంటి నుండి మార్నింగ్ వాక్ కు వెళ్లిన  ఉత్తమ్ ఆనంద్ ను తన ఇంటికి అరకిలోమీటర్ దూరంలోనే వాహనం ఢీకొట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి.బుధవారం నాడు ఉదయం మార్నింగ్ వాక్ కి బయలుదేరిన జడ్జిని ఢీకొట్టిన వాహనం ఆగకుండా వెళ్లిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి.  రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న అతడిని ఓ వ్యక్తి ఆసుపత్రికి తరలించారు.

బుధవారం నాడు ఉదయం 7 గంటలకు పోలీసులకు జడ్జి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ చేసిన పోలీసులకు రోడ్డు ప్రమాదంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది జడ్జిగా గుర్తించారు.ఈ వాహనం ఉద్దేశ్యపూర్వకంగా జడ్జిని ఢీకొట్టిందని పోలీసులు అనుమానిస్తున్నారు. జడ్జిని ఢీకొట్టడానికి కొద్దిగంటల ముందే ఈ వాహనం చోరీకి గురైందని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

ధన్‌బాద్ పట్టణంలో మాఫియా హత్యల కేసులను జడ్జి విచారణ చేస్తున్నారు. జార్ఖండ్ జడ్జి ఉదంతాన్ని సుప్రీంకోర్టులో ఇవాళ బార్ అసోసియేషన్ సీజేఐ దృష్టికి తీసుకొచ్చింది.  హైకోర్టు న్యాయమూర్తి దృష్టిలో ఈ కేసు ఉందన్నారు. ఈ కేసు గురించి జాగ్రత్త తీసుకొంటామని చీఫ్ జస్టిస్ రమణ హామీ ఇచ్చారు. ఈ సమయంలో తాము జోక్యం చేసుకొంటే దర్యాప్తునకు ఆటంకం కలుగుతోందని ఆయన చెప్పారు.

click me!