భర్త రెండో పెళ్లి.. చంపుతానని బెదిరించిన భార్య.. కోపంతో నడిరోడ్డులో కాల్చి...చివరికి...

Published : Jul 29, 2021, 11:53 AM IST
భర్త రెండో పెళ్లి.. చంపుతానని బెదిరించిన భార్య.. కోపంతో నడిరోడ్డులో కాల్చి...చివరికి...

సారాంశం

ఆ విషయాన్ని అతను అంగీకరించాడు. ఆమె తనను చంపుతానని బెదిరించిందని, అందుకే రూ. మూడు లక్షలు ఇచ్చి తానే ఆమెను చంపించానని పోలీసులు పోలీసులకు తెలిపాడు.

ఉత్తరప్రదేశ్లోని ముజఫరానగర్ లో ఈ నెల 12న నడిరోడ్డుపై ఓ మహిళను కాల్చి చంపిన ఘటన సంచలనం రేకెత్తించింది. ఈ కేసు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేశారు. స్వయంగా భర్తే ఆమెను చంపించాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 

ఆ విషయాన్ని అతను అంగీకరించాడు. ఆమె తనను చంపుతానని బెదిరించిందని, అందుకే రూ. మూడు లక్షలు ఇచ్చి తానే ఆమెను చంపించానని పోలీసులు పోలీసులకు తెలిపాడు.

ముజఫర్ నగర్ కు చెందిన సోను, మొహ్సీనా 2012లో వివాహం చేసుకున్నారు. సంవత్సరం తర్వాత మొహ్సీనా తన వదిన హత్య కేసులో జైలుకు వెళ్లింది. ఈ సమయంలో సోనూ మరో మహిళను వివాహం చేసుకున్నాడు.  రెండున్నర సంవత్సరాల శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చిన మొహ్సీనా సోనూతో గొడవ పెట్టుకుంది. 

ఆస్తిలో తనకు వాటా ఇవ్వాల్సిందిగా బెదిరించింది. లేకపోతే చంపేస్తానని హెచ్చరించింది. మొహ్సీనా తరచుగా  బెదిరిస్తుండడంతో సోనూ రంగంలోకి దిగాడు. సోనూ రెండో భార్య తండ్రి మెహర్భాన్ కూడా ఈ హత్యలో పాలుపంచుకున్నాడు. 

కిరాయి గూండాలకు రూ.3 లక్షలు ఇచ్చి మొహ్సీనాను చంపించాడు. నడిరోడ్డు మీద మహిళను చంపడంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. త్వరగానే దర్యాప్తు పూర్తి చేసి నిందితులను కనిపెట్టారు. సోనూను, మెహర్భాన్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport