దారుణం : పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రియుడితో కలిసి కన్నతండ్రినే చంపి, చెట్టుకు వేలాడదీసిన కూతురు...!

Published : Jul 29, 2021, 11:32 AM IST
దారుణం : పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రియుడితో కలిసి కన్నతండ్రినే చంపి, చెట్టుకు వేలాడదీసిన కూతురు...!

సారాంశం

తమ పెళ్లికి తండ్రి అంగీకరించలేదని కోపంతో కుమార్తె తన ప్రియుడితో కలిసి తండ్రిని హతమార్చింది. ఆ తరువాత చెట్టుకు వేలాడదీసింది. బరేలీ లోని స్తంభాల గ్రామానికి చెందిన  హర్పాల్ సింగ్ (46) తన కూతురు ప్రేమ,పెళ్లిని వ్యతిరేకించారు. అంతేకాదు ఆ వివాహం చేసుకుంటే.. తనకు ఉన్న 10 బిగాహాల భూమిని కూడా కుమార్తెకు ఇవ్వడానికి నిరాకరించాడు.

ప్రేమించినవాడితో పెళ్లికి అంగీకరించలేదని ఓ కూతురు దారుణానికి తెగబడింది. కన్నతండ్రినే అత్యంత దారుణంగా చంపింది. ప్రియుడు, అతని స్నేహితులతో కుమ్మక్కై కన్నతండ్రిని కాటికి పంపింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీ నగర్లో జరిగింది.

తమ పెళ్లికి తండ్రి అంగీకరించలేదని కోపంతో కుమార్తె తన ప్రియుడితో కలిసి తండ్రిని హతమార్చింది. ఆ తరువాత చెట్టుకు వేలాడదీసింది. బరేలీ లోని స్తంభాల గ్రామానికి చెందిన  హర్పాల్ సింగ్ (46) తన కూతురు ప్రేమ,పెళ్లిని వ్యతిరేకించారు. అంతేకాదు ఆ వివాహం చేసుకుంటే.. తనకు ఉన్న 10 బిగాహాల భూమిని కూడా కుమార్తెకు ఇవ్వడానికి నిరాకరించాడు.

డ్యాన్సింగ్ బామ్మ : డెభ్బైయేళ్ల వయసులో డ్యాన్స్ ను ఇరగదీస్తుంది, వీడియోలు వైరల్...

దీంతో పొలానికి వచ్చిన హర్పాల్ సింగ్ కు అతని కుమార్తె ప్రీతి, ప్రియుడు ధర్మేంద్ర యాదవ్,  మరో స్నేహితుడితో కలిసి మద్యం తాగించారు. ఆ తరువాత ఇనుప రాడ్ తో కొట్టారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తరువాత అతన్ని చెట్టుకు వేలాడదీశారు.  

భర్త మరణించిన సంగతి తెలిసిన భార్య.. మృతదేహాన్ని చూడగా.. దానిమీద గాయాల ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుమార్తె, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు.  మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. తమ పెళ్లిని వ్యతిరేకించినందువల్లే తండ్రిని చంపామని కుమార్తె ప్రీతి పోలీసులకు చెప్పింది.
 
PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu