గుడ్‌న్యూస్: 60 మంది కరోనా రోగులపై సిద్ద థెరపీతో స్టడీ

By narsimha lodeFirst Published Jul 1, 2020, 10:50 AM IST
Highlights

 సిద్ద థెరపీ విధానాన్ని 60 మంది కరోనా రోగులపై అధ్యయనం చేయనుంది. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ద ఆధ్వర్యంలో  కరోనా రోగులపై అధ్యయనం నిర్వహించనున్నారు. 


న్యూఢిల్లీ:  సిద్ద థెరపీ విధానాన్ని 60 మంది కరోనా రోగులపై అధ్యయనం చేయనుంది. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ద ఆధ్వర్యంలో  కరోనా రోగులపై అధ్యయనం నిర్వహించనున్నారు. 

సిద్ద గ్రూప్ మెడిసిన్స్ 'కబసుర కుడినీర్' ను కరోనా రోగులకు చికిత్స అందించేందుకు వీలుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్టాన్లీలో కరోనా రోగులపై సిద్ద థెరపీని ప్రయోగించారు. ఈ థెరపీ మంచి ఫలితాలను ఇచ్చినట్టుగా చెబుతున్నారు.

కబసురా కుడినీర్ ఒక మూలికా మిశ్రమం. ఇందులో అల్లం, పిప్పిలి, లవంగం, సిరుకాంకోరి వేర్లతో పాటు పలు మూలికల పొడి పదార్ధాలు ఉంటాయి.కరోనా రోగులపై సిద్దా థెరపీని ప్రయోగించేందుకుగాను క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ నుండి అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్టుగా సీసీఆర్ ఎస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కె. కనకవల్లి తెలిపారు.సీసీఆర్ఎస్ అనేది సిద్ద వైద్య విధానంలో పరిశోధనలకు సంబంధించిన అత్యున్నత విభాగం.

గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ స్థాపించిన కరోనా కేర్ సెంటర్ లో 60 మంది కరోనా సోకిన రోగులపై ఈ సిద్ద థెరపీని ప్రయోగించనున్నారని డాక్టర్ వల్లి తెలిపారు.
30 మంది రోగులపై స్టాన్లీ ఆసుపత్రిలో కరోనా రోగులపై దీన్ని ప్రయోగించినప్పుడు సానుకూల ఫలితాలు వచ్చినట్టుగా ఆమె గుర్తు చేశారు.

also read:భారత్ బయోటెక్ గుడ్‌న్యూస్: జూలైలో హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్

అంతేకాదు సిద్దా సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 15 వేల మంది కరోనా రోగులపై ఈ సిద్ద థెరపీని అధ్యయనం చేసింది.బెంగుళూరు, ఢిల్లీ, తిరుపతి, పాలయంకోట్టై, పుదుచ్చేరిలోని ఎస్‌సీఆర్ఐ యూనిట్లలో అధ్యయనం జరుగుతోంది.  కోయంబత్తూరులో మూలికా మిశ్రమం సిద్ద మెడిసిన్ ఔషధాల సమూహంపై అధ్యయనం నిర్వహిస్తున్నారు.


 

click me!