మరోసారి ఉగ్రదాడి... సీఆర్పీఎఫ్ జవాను సహా.. పౌరుడు మృతి

Published : Jul 01, 2020, 10:43 AM ISTUpdated : Jul 01, 2020, 10:48 AM IST
మరోసారి ఉగ్రదాడి... సీఆర్పీఎఫ్ జవాను సహా.. పౌరుడు మృతి

సారాంశం

ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ముష్కరుల కోసం సైన్యం ముమ్మరంగా గాలిస్తోంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి  పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.  బారాముల్లా జిల్లాలోని సోపోర్ లోని సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జవాన్లను టార్గెట్ చేస్తూ..విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. కాగా.. ఈ ఘటనలో ఒక జవాను వీరమణం పొందగా.. మరో సాధారణ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు.

వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఉగ్రదాడిలో మూడేళ్ల బాలుడిని సైన్యం కాపాడింది. చిన్నారికి బుల్లెట్లు తగలకుండా సురక్షితంగా అక్కడ నుంచి తప్పించారు. ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ముష్కరుల కోసం సైన్యం ముమ్మరంగా గాలిస్తోంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి  పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరోవైపు, రాజౌరీ సెక్టార్‌‌లోని కేరి ప్రాంతంలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో సరిహద్దుల్లోని నియంత్రణ రేఖను దాటి 400 మీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పులను సమర్ధంగా తిప్పికొట్టిన భారత సైన్యం.. ఓ ఉగ్రవాదిని హతమార్చింది. అతడి వద్ద ఏకే 47, ఓ మ్యాగిజైన్ స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం సైన్యం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Rs 500 Notes : నిజంగానే ఆర్బిఐ రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేస్తుందా..? కేంద్రం క్లారిటీ
Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu