
19-Year-Old Girl Gang-Raped In Jharkhand: జార్ఖండ్ లో 19 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం పాల్పడిన నలుగురు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర రాజధాని రాంచీకి 125 కిలోమీటర్ల దూరంలోని జల్దేగా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. దేశంలో ఏదో ఒక చోట నిత్యం మహిళలపై దాడులు, అఘాయిత్యాలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే జార్ఖండ్ లోని సిమ్దేగా జిల్లాలో 19 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించామనీ, నలుగురు నిందితులను అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధాని రాంచీకి 125 కిలోమీటర్ల దూరంలోని జల్దేగా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బాలిక గుర్తించిన తర్వాత నలుగురు నిందితులను అరెస్టు చేశామని జల్దేగా పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ బీరేంద్ర శర్మ తెలిపారు. 'ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని తెలిపారు. జల్దేగా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలోని బంధువుల ఇంటికి బాలిక శనివారం వచ్చింది. సోమవారం ఆమె వీక్లీ మార్కెట్ కు వెళ్లింది. తిరిగి వస్తుండగా ఓ యువకుడు తన ఆటో రిక్షాలో సీటు ఇస్తానని చెప్పి ఆమెను పాడుబడిన గదిలోకి తీసుకెళ్లి తన స్నేహితుడితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు' అని బాలిక వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ బీరేంద్ర శర్మ తెలిపారు.
మరుసటి రోజు ఆమెను ఓ క్వార్టర్స్ కు తీసుకెళ్లి నలుగురు వ్యక్తులు రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం ఉదయం విలియం చౌక్ సమీపంలో బాలికను వదిలివెళ్లారు. ఈ క్రమంలోనే బాలిక కుటుంబ సభ్యులకు జరిగిన దారుణం గురించి వివరించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. జల్దేగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాలికను శుక్రవారం వైద్య పరీక్షలకు పంపుతామని పోలీస్ స్టేషన్ ఇన్చార్జి తెలిపారు.