మద్రాస్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ తహిల్ రమణికి సీబీఐ క్లీన్ చీట్ - లోక్ సభలో వెల్లడించిన కేంద్రం

By team teluguFirst Published Dec 17, 2022, 10:28 AM IST
Highlights

మద్రాస్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి విజయ కమలేష్‌ తహిల్‌ రమణికి సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్ సభలో వెల్లడించింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని స్పష్టం చేసింది. 

మద్రాస్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి విజయ కమలేష్‌ తహిల్‌ రమణిపై అక్రమాస్తులు, అవినీతి, రాజకీయ పక్షపాతం ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపిందని, అయితే ఎలాంటి విచారణార్హమైన నేరాన్ని కమిషన్‌ను కనుగొనలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని లోకసభలో శుక్రవారం వెల్లడించింది.

తమిళనాడులో పరువుహత్య : పెళ్లి కాకుండానే గర్భం.. 19యేళ్ల అమ్మాయికి పురుగులమందు తాగించి తండ్రి, మేనత్త ఘాతుకం..

డీఎంకే పార్టీకి చెందిన ఏకేపీ చిన్‌రాజ్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ సమాచారాన్ని తెలియజేశారు. తమిళనాడు మంత్రితో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో పాటు చైన్నైలో అక్రమ ఆస్తులు, విగ్రహాల చోరీ కేసులను విచారించే ప్రత్యేక బెంచ్ ను రద్దు చేయాలని ఆమె తీసుకున్న నిర్ణయంపై గతంలో ఐబీ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో జస్టిస్ తహిల్ రమణిపై చర్యలు తీసుకోవాలని 2019లో అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్ సీబీఐని ఆదేశించారు.

పన్నెండేళ్ల విద్యార్థికి కార్డియాక్ అరెస్ట్.. స్కూలు బస్సులోనే కుప్పకూలి, మృతి..

మెరుగైన న్యాయ పాలన అనే కారణంతో ఆమెను మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. కానీ జస్టిస్ తహిల్ రమణి రాజీనామా చేశారు. ఈ విషయంలో ఆ సమయంలో వార్తల్లో నిలిచింది. కొంత కాలంగా మరుగునపడిపోయింది. ఈ క్రమంలో మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై మోపిన అభియోగాల కేసు విషయం ఎక్కడి వరకు వచ్చిందని డీఎంకే సభ్యుడు చిన్ రాజ్ లోక్ సభలో కేంద్రాన్ని అడిగారు.

జాతీయ ప్రజా ఉద్యమంగా భారత్ జోడో యాత్ర.. : బీజేపీపై మ‌ల్లికార్జున ఖ‌ర్గే విమ‌ర్శ‌లు

‘‘ 2019 జూలై-నవంబర్ మధ్య మాజీ న్యాయమూర్తిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి సీబీఐకి ఆదేశాలు వచ్చాయా ? సీబీఐ ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా ? ’’ అని చిన్ రాజ్ ప్రశ్నించారు. అయితే దీనికి మంత్రి సమాధానం ఇస్తూ  26.09.2019 సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ నుంచి రిఫరెన్స్ వచ్చిందని చెప్పారు. అయితే దీనిని సీబీఐ పరిశీలించిందని, కానీ అందులో ఎలాంటి నేరం గుర్తించలేదని, ఎలాంటి నేరం నమోదు కాలేదని అన్నారు.

click me!