తమిళనాడులో పరువుహత్య : పెళ్లి కాకుండానే గర్భం.. 19యేళ్ల అమ్మాయికి పురుగులమందు తాగించి తండ్రి, మేనత్త ఘాతుకం..

Published : Dec 17, 2022, 08:12 AM IST
తమిళనాడులో పరువుహత్య : పెళ్లి కాకుండానే గర్భం.. 19యేళ్ల అమ్మాయికి పురుగులమందు తాగించి తండ్రి, మేనత్త ఘాతుకం..

సారాంశం

పెళ్లి కాకుండా గర్భవతి అయ్యిందని కన్న కూతురుని అత్యంత దారుణంగా హతమార్చాడో దుర్మార్గుడు. తండ్రి, మేనత్త కలిసి ఆమెకు పురుగుల మందు తాగించారు. 

తమిళనాడు : పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయిందని ఓ అమ్మాయిని దారుణంగా హతమార్చారు కుటుంబ సభ్యులు. ఈ విషాద ఘటన  తమిళనాడులో చోటు చేసుకుంది. కూతురుని పరువు హత్య చేసిన  తండ్రి, అతనికి సహకరించిన మేనత్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ నెల 9వ తేదీన తిరుచ్చి జిల్లా తిరుప్పరత్తురై సమీపంలోని  బహిరంగ ప్రదేశంలో.. అప్పుడే పుట్టిన మగ శిశువును ఎవరో వదిలేసి వెళ్లారు. ఇది స్థానికులు గుర్తించారు. వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం తెలపడంతో వారు దర్యాప్తు చేపట్టారు.

వీరి దర్యాప్తులో ఎలమనూర్ కు చెందిన ఓ కాలేజీ స్టూడెంట్ మీద అనుమానం వచ్చింది. దీంతో, వివరాలు సేకరించడానికి 19 ఏళ్ల ఆ కాలేజీ విద్యార్థిని ఇంటికి వెళ్లారు. అయితే పోలీసులు వెళ్లేసరికి ఆ విద్యార్థిని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఆమెకి విషప్రయోగం జరిగిందని గమనించిన పోలీసులు వెంటనే తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ విద్యార్థిని చికిత్స పొందుతూ..  గురువారం మృతి చెందింది. చనిపోవడానికి ముందు ఆమె ఇచ్చిన వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

పన్నెండేళ్ల విద్యార్థికి కార్డియాక్ అరెస్ట్.. స్కూలు బస్సులోనే కుప్పకూలి, మృతి..

బహిరంగ ప్రదేశంలో వదిలేసిన శిశువు ఆమెకు పుట్టినదే అని తేలింది. పెళ్లికి ముందే గర్భం దాల్చిందని.. నెలలు నిండి బిడ్డకు జన్మనిచ్చింది అని  తేలింది. గర్భం దాల్చిన విషయం తెలియడంతో తండ్రి సెల్వమణి, మేనత్త మల్లిక ఇద్దరూ కలిసి ఆ విద్యార్థినితో  పురుగులమందు బలవంతంగా తాగించారు. ఈ విషయం ఆమె తన వాంగ్మూలంలో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu