జీవీకే గ్రూప్ చైర్మన్, ఆయన కొడుకు పై సిబిఐ కేసు

By Sreeharsha GopaganiFirst Published Jul 2, 2020, 8:29 AM IST
Highlights

జీవీకే గ్రూప్ చైర్మన్ వెంకట కృష్ణ రెడ్డి గునుపాటి, అతని కుమారుడు జీవీ సంజయ్ రెడ్డిలపై సిబిఐ కేసు నమోదు చేసింది. 805 కోట్ల రూపాయలను దారి మళ్లించారు అనే వ్యవహారంలో వీరిపై సిబిఐ కేసు నమోదు చేసినట్టు పేర్కొంది. 

జీవీకే గ్రూప్ చైర్మన్ వెంకట కృష్ణ రెడ్డి గునుపాటి, అతని కుమారుడు జీవీ సంజయ్ రెడ్డిలపై సిబిఐ కేసు నమోదు చేసింది. 805 కోట్ల రూపాయలను దారి మళ్లించారు అనే వ్యవహారంలో వీరిపై సిబిఐ కేసు నమోదు చేసినట్టు ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. 

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రభుత్వ,ప్రైవేటు భాగస్వామ్య సంస్థ మియాల్‌ (ముంబై ఎయిర్ పోర్ట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్)తో ఒప్పందం కుదుర్చుకుంది. 

2012-18 మధ్య 805 కోట్ల రూపాయల డబ్బును దారి మళ్లించారని వారిపై అభియోగాలు నమోదు చేసారు. ముంబై ఎయిర్ పోర్ట్ వ్యవహారంలో గ్వక్ 50 శాతం వాటాను కలిగి ఉండగా ఎయిర్ పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా 22 శాతం వాటాను కలిగి ఉంది. 

2006లో కుదిరిన ఒప్పందం ప్రకారం మియాల్ ముంబై ఎయిర్ పోర్టు నిర్వహణను చేపడుతుంది. వచ్చిన ఆదాయంలో 38.7 శాతాన్ని ఏఏఐ కి చెల్లించాల్సి ఉంటుంది ఫీజుగా. మిగిలిన డబ్బునంతటిని వారు విమానాశ్రయ అభివృద్ధి, ఆధునీకరణకు వినియోగించాల్సి ఉంది. 

కానీ ఇలా అభివృద్ధికి వాడాల్సిన డబ్బును ధరి మళ్లించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు పోలీసులు. 2012 నుంచి 2018 మధ్య దాదాపుగా 395 కోట్ల రూపాయలను దురుద్దేశం పూర్వకంగా, ఇతర కంపెనీలకు ధరి మళ్లించారని పేర్కొన్నారు. 

అభియోగాల ప్రకారం జీవీకే గ్రూపుకు 805 కోట్ల రూపాయల లబ్ది చేకూరినట్టు పేర్కొన్నారు. కానీ వాస్తవానికి వారికి చేకూరిన లబ్ది 1000 కోట్లకు పైమాటే అని, ఈ కాలంలో వారి మియాల్ ఆదాయాన్ని తక్కువగా చూపెట్టారని సిబిఐ వర్గాలు తెలిపినట్టు వార్తాకథనంలో పేర్కొన్నారు. 

click me!