గుడ్‌న్యూస్: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు మార్చుకొనే ఛాన్స్

By narsimha lodeFirst Published Jul 1, 2020, 5:30 PM IST
Highlights

ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను మార్చుకొనే అవకాశాన్ని యూపీఎస్‌సీ బుధవారం నాడు ప్రకటించింది. యూపీఎస్‌సీ ప్రిలిమినరీ పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీన నిర్వహించనున్నారు. 

న్యూఢిల్లీ:  ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను మార్చుకొనే అవకాశాన్ని యూపీఎస్‌సీ బుధవారం నాడు ప్రకటించింది. యూపీఎస్‌సీ ప్రిలిమినరీ పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీన నిర్వహించనున్నారు. 

సివిల్స్  ప్రిలిమినరీ, ఐఎఫ్ఎస్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరౌతున్న  అభ్యర్థుల అభ్యర్థన మేరకు పరీక్షా కేంద్రాలను మార్చుకొనే అవకాశం ఇవ్వాలని యూపీఎస్‌సీ నిర్ణయించింది. 

also read:యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల షెడ్యూల్ ఇదీ

సివిల్స్ మెయిన్స్  2020 పరీక్షలు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్  మెయిన్స్ పరీక్షల కోసం కూడ పరీక్షా కేంద్రాలను మార్చుకొనే అవకాశాన్ని కల్పించింది.  ఈ ఏడాది జూలై 7 నుండి 13వ తేదీవరకు మొదటి విడతలో, జూలై 20 నుండి 24 వరకు రెండో విడతలో  తమ వెబ్ సైట్ ద్వారా తమ పరీక్షా కేంద్రాలను మార్చుకోవచ్చని యూపీఎస్‌సీ ప్రకటించింది.

 పరీక్షా కేంద్రాలను మార్చుకొనే అభ్యర్థులు https://upsconline.nic.in వెబ్ సైట్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎవరు తొలుత ధరఖాస్తు చేసుకొంటే వారికే తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా యూపీఎస్‌సీ తెలిపింది. సీలింగ్ కారణంగా తాము కోరుకొన్న పరీక్షా కేంద్రాన్ని పొందలేని వారు మిగిలిన వాటి నుండి ఒక కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది.

click me!