కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు.. ఈ పైనాపిల్ తినండి!

By telugu news teamFirst Published Jul 2, 2020, 8:20 AM IST
Highlights

ముఖ్యమంత్రి కరోనా రెసిస్టెన్స్ క్యాంపెయిన్ కింద పైనాపిల్‌తో పాటు నిమ్మ‌ర‌సాన్ని ప్రతి శనివారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేయ‌నున్నారు. 
 

దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకీ ఊహించని విధంగా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి రోజూ కనీసం 15వేలకు పైగా కేసులు నమోదౌతున్నాయి. కాగా.. ఈ వైరస్ ని ఎదురుకునేందుకు ప్రజలకు పైనాపిల్‌, నిమ్మ‌కాయ‌ల‌ను పంచాల‌ని త్రిపురలోని బిప్లబ్ కుమార్ దేబ్ సర్కార్ నిర్ణయించింది. 

పైనాపిల్‌, నిమ్మ‌కాయ‌లోని విట‌మిన్ సి కార‌ణంగా రోగ‌నిరోధ‌కశ‌క్తి అభివృద్ధి చెందుతుంద‌ని, త‌ద్వారా క‌రోనాను త‌రిమికొట్ట‌వ‌చ్చ‌ని త్రిపుర ప్ర‌భుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి కరోనా రెసిస్టెన్స్ క్యాంపెయిన్ కింద పైనాపిల్‌తో పాటు నిమ్మ‌ర‌సాన్ని ప్రతి శనివారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేయ‌నున్నారు. 

క‌రోనాకు వ్యాక్సిన్‌ వ‌చ్చేంత‌వ‌ర‌కూ ఆ వ్యాధి బారిన ప‌డ‌కుండా ఉండేందుకు రోగ‌నిరోధ‌క‌శ‌క్తి పెంచుకోవ‌డ‌మే మ‌న ముందున్న మార్గ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. కాగా త్రిపుర‌లో ఈనెల 4 నుంచి పైనాపిల్‌, నిమ్మ‌ర‌సం పంపిణీ ప్రారంభం కానుంది. ఈ కార్య‌క్ర‌మం కోసం ప్ర‌భుత్వం పైనాపిల్, నిమ్మ రైతుల నుండి ఫ‌ల‌సాయాన్ని నేరుగా సేకరించ‌నుంది. తద్వారా ప్ర‌భుత్వం నుంచి వారికి ల‌బ్ధి చేకూర‌నుంది. 

click me!