The Kerala Story Controversy: సినిమాలో పది మార్పులను సూచించిన సీబీఎఫ్‌సీ.. అవేమిటంటే?

Published : May 01, 2023, 08:25 PM IST
The Kerala Story Controversy: సినిమాలో పది మార్పులను సూచించిన సీబీఎఫ్‌సీ.. అవేమిటంటే?

సారాంశం

ది కేరళ స్టోరీ సినిమా విడుదలకు ముందు పది మార్పులను చేయాలని సీబీఎఫ్‌సీ చిత్ర యూనిట్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు కీలకమైన సన్నివేశాలు, డైలాగ్‌లను సినిమా నుంచి తొలగించారు. ఆ పది మార్పుల వివరాలు ఇలా ఉన్నాయి.  

తిరువనంతపురం: ది కేరళ స్టోరీ  ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో భిన్న వాదనలు ముందుకు వచ్చాయి. కొందరు ఆ స్టోరీని సపోర్ట్ చేస్తుంటే మెజార్టీ యూజర్లు వ్యతిరేకించారు. అవాస్తవాలంటూ కొట్టిపారేశారు. కేరళ ప్రజల నుంచే కాక రాజకీయ పార్టీల నుంచీ ఈ సినిమాపై వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో సీబీఎఫ్‌సీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) సినిమాలో పలు మార్పులను సూచించింది. ఈ సినిమాలో పది మార్పులు చేసి థియేటర్‌లలో విడుదల చేయాలని ఆదేశించింది.

ఈ పది మార్పుల గురించి సినిమా విశ్లేషకుడు ఏబీ జార్జ్ ట్వీట్ చేశారు. ఆ మార్పులు ఇలా ఉన్నాయి. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే కేరళ మాజీ సీఎం వీఎస్ అచుతానందన్ ఇంటర్వ్యూను పూర్తిగా తొలగించారు. ఇండియన్ మ్యూనిస్టులు పెద్ద హిపోక్రైట్లు అనే డైలాగ్‌లో ఇండియన్ అనే పదాన్ని తొలగించారు. అలాగే, హిందూ దేవుళ్లను విమర్శించే సంభాషణలు, డైలాగ్‌లను నాగరికంగా సవరించుకోవాలని, మతపరమైన భావోద్వేగాలు రగిలేలా ఉండకూడదని సీబీఎఫ్‌సీ తెలిపింది. కమ్యూనిస్టు పార్టీ నేతలు పూజా కార్యక్రమాల్లో పాల్గొనరు అనే డైలాగ్‌నూ తొలగించాలని ఆదేశించింది. ఈ డైలాగ్‌ను సినిమా నుంచి తొలగించారు.

Also Read: సంఘ్ పరివార్ అబద్ధాల ఫ్యాక్టరీ నుంచే ది కేరళ స్టోరీ సినిమా పుట్టింది: కేరళ సీఎం పినరయి విజయన్

ఈ సినిమాలో 32 వేల మంది హిందూ యువతులు కనిపించకుండా పోయారని, వారు ఉగ్రవాద సంస్థ చేరారని పేర్కొన్నారు. ఈ సంఖ్యపైనా వివాదం రేగింది. మన దేశం నుంచి రెండంకెలకు మించకుండా ఈ ఉగ్రవాద సంస్థలో చేరినట్టు వివరాలు ఉన్నాయని వాదించారు. అదీ కేరళ కంటే యూపీలో ఎక్కువ మంది ఐఎస్‌లో చేరిన సంఖ్యలు ఉన్నాయనే వాదనలూ చేశారు. ఈ నేపథ్యంలోనే సీబీఎఫ్‌సీ సంఖ్యకు సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్సులు సమర్పించాలని ఆదేశించింది.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..