Tamil Nadu Students Suicide: "ఆ విద్యార్థిని ఆత్మహత్యకు.. ఆశ్రమ నిర్వాహకుడే కారణం": CB-CID

Published : Jun 22, 2022, 03:50 AM IST
Tamil Nadu Students Suicide: "ఆ విద్యార్థిని ఆత్మహత్యకు.. ఆశ్రమ నిర్వాహకుడే కారణం": CB-CID

సారాంశం

Tamil Nadu Students Suicide: గ‌త‌ ఫిబ్ర‌వ‌రిలో తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని ఓ ఆశ్రమంలో 20 యేళ్ల కాలేజీ విద్యార్థిని ఒకరు విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ఆశ్రమ నిర్వ‌హ‌కుడిని  సీబీసీఐడీ విచారించ‌గా అస‌లు  నిజాలు బ‌హిర్గ‌తమ‌య్యాయి. ఆశ్ర‌మ నిర్వాహకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.     

Tamil Nadu Students Suicide: దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న రేపిన తిరువళ్లూరు విద్యార్థిని ఆత్మహత్య కేసును CB-CID ఛేదించింది. ఆ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు ఆశ్రమ నిర్వాహకుడే కారణమ‌ని CB-CID అధికారులు నిర్ధారించారు. అనంత‌రం ఆశ్ర‌మ నిర్వ‌హ‌కుడిని అరెస్టు చేశారు. 

వివరాలోకెళ్తే.. తిరువళ్లూరు జిల్లా చెంబేడు గ్రామానికి చెందిన హేమమాలిని(22) ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఆ యువతి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది.. దీంతో  ఆమె బంధువులు 2021లో వెల్లాత్తుకోటలోని ఓ ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఆ యువతిని పరిశీలించిన ఆశ్రమ నిర్వాహకుడు మునస్వామి నాగదోషం ఉన్నట్లు.. ఈ యువతికి ప్రతి పౌర్ణమి, అమావాస్యలకు ప్రత్యేక పూజలు చేస్తే బాగుప‌డుతుందని మునుస్వామి నమ్మించాడు. అప్పటినుంచి గత యేడాదిగా ఆ యువతి ఆశ్రమంలోనే ఉంటూ, చికిత్స తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 14న మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో యువతి బంధువులు ఆశ్రమానికి తీసు కెళ్లారు. అయితే.. రెండు రోజుల తరువాత హేమామాలిని అక్కడ ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను తిరువళ్లూరు వైద్యశాలకు తరలించగా అక్కడ చిక్సిత పొందుతూ.. మృతి చెందింది. యువతి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ.. పలు సంఘాలు ఆందోళన చేపట్టడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.కానీ, ఆశ్ర‌మ నిర్వ‌హ‌కుడు మునస్వామిని మాత్రం పోలీసులు అరెస్టు చేయలేదు.

ఈ నేపథ్యంలో ఈ కేసును సీబీసీఐడీకి మార్చాలని రాష్ట్ర‌వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించింది. కేసును విచారించిన సీబీసీఐడీ పోలీసులకు అనేక విస్తూకొలిపే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆ యువతిపై ఆశ్రమ నిర్వాహకుడు మునస్వామి పలుమార్లు అత్యాచారం చేసాడని, తరచూ తనకు లొంగాలని వేదించడం వల్లే.. ఆ యువ‌తి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు. అనంతరం ఆదివారం అర్ధరాత్రి ఆశ్రమ నిర్వాహకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్