సిబ్బంది నిర్లక్ష్యం... శవాన్ని పీక్కుతిన్న పిల్లి

Published : Nov 21, 2018, 11:12 AM IST
సిబ్బంది నిర్లక్ష్యం... శవాన్ని పీక్కుతిన్న పిల్లి

సారాంశం

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. ఓ మహిళ శవాన్ని పిల్లి పీక్కుతిన్నది.

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. ఓ మహిళ శవాన్ని పిల్లి పీక్కుతిన్నది. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటీవల ఓ మహిళ చికిత్స కోసం చేరింది.

కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె సోమవారం రాత్రి మృతిచెందింది. అయితే.. ఆమె తరపు బంధువులు ఎవరూ రాలేదు. ఆమె అనాథ అని తెలిసింది. దీంతో.. వివరాలు తెలియవంటూ.. ఆమె శవాన్ని కనీసం మార్చురీకి కూడా తరలించలేదు. అక్కడే ఒక వార్డులో పక్కన పేడేశారు.

శవాన్ని అలా పడేయడంతో వాసన వస్తోందని ఇతర రోగులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో.. అక్కడ తిరిగే పిల్లి ఒకటి ఆమె శవాన్ని పీక్కుతినడం మొదలుపెట్టింది. దీంతో.. ఆమె శవాన్ని అక్కడి నుంచి తొలగించాలంటూ రోగులు ఆందోళన చేపట్టారు.

వారి ఆందోళన విరమించేందుకు.. సిబ్బంది ఆ అనాథ శవాన్ని మార్చురీకి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్
ప్రధాని మోదీకి కమల్ హాసన్ కీలక విజ్ఞప్తి | Kamal Haasan Pressmeet | Asianet News Telugu