బిహార్ కుల గణన ప్రాథమిక నివేదిక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ 215 కులాల ఆర్థిక స్థితిగతులను వెల్లడించే రెండో విడత నివేదికను ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
న్యూఢిల్లీ: బిహార్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన రిపోర్టు రెండో భాగాన్ని ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 215 ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కులాల ఆర్థిక స్థితిగతులను ఈ రిపోర్టు వివరించింది. ఈ రిపోర్టు ప్రకారం బిహార్‌లో 42 శాతం ఎస్సీ కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. జనరల్ కేటగిరీకి చెందిన 25 శాతం ప్రజలు పేదరికంలో ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. 42.70 శాతం ఎస్టీ కుటుంబాలు, 33.16 శాతం ఓబీసీలు, 33.58 శాతం ఈబీసీలు పేదలు అని వెల్లడించింది. మిగిలిన కులాల్లో 23.72 శాతం మంది పేదలుగా ఉన్నారని పేర్కొంది.
జనరల్ కేటగిరీలో ప్రభుత్వ ఉద్యోగాలు
undefined
బిహార్ క్యాస్ట్ సర్వే రిపోర్టు ప్రకారం జనరల్ కేటగిరీకి చెందిన సుమారు 6 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఇది మొత్తం జనాభాలో 3.19 శాతంగా ఉన్నది. 4.99 శాతం భూమిహారులకు, 3.60 శాతం మంది బ్రాహ్మణులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. రాజ్‌పుత్‌లో 3.81 శాతం, కాయస్త కమ్యూనిటీలో 6.68 శాతం మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి.
షేక్ కమ్యూనిటీలో 39,595 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఇది మొత్తం జనాభాలో 0.79 శాతం. పఠాన్ కమ్యూనిటీకి 10,517 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి.
Also Read: పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర! డిసెంబర్-ఫిబ్రవరిలో చేపట్టడానికి ప్లాన్
బీసీల్లో ప్రభుత్వ ఉద్యోగాలు
బీసీల్లో 6,21,481 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నట్టు బిహార్ కుల గణన రిపోర్టు వెల్లడిస్తున్నది. ఇది మొత్తం బిహార్ జనాభాలో 1.75 శాతంగా ఉన్నది. యాదవ్ కమ్యూనిటీకి చెందిన 2,89,538 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఇది రాష్ట్రం మొత్తం జనాభాలో 1.55 శాతం. 2.04 శాతం కుశ్వాహాలు, 3.11 శాతం కుర్మిలు, 1.96 శాతం మంది ట్రేడ్స్ మ్యాన్, 0.63 శాతం సుర్జాపురి ముస్లింలు, 4.21 శాతం మంది భాంత్‌లు, 1.39 శాతం మంది మాలిక్ ముస్లింలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు.