రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ కుల గణన అంశాన్ని మళ్లీ ప్రస్తావించారు. కుల గణన దేశానికి ఒక ఎక్స్ రే అని చెప్పారు. ఎవరి జనాభా ఎంత ఉందని తెలియాలని అన్నారు.
caste census : కుల గణన దేశానికి ఒక ఎక్స్ రే అని, దానిని కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని ఆ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. రాజస్థాన్ ఎన్నికల నేపథ్యంలో ఉదయ్ పూర్ లోని వల్లభ్ నగర్ లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరి జనాభా ఎంత అనేది తెలియాల్సిన విషయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజస్థాన్ లో కుల గణన నిర్వహిస్తామని చెప్పారు. కేంద్రంలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దేశం మొత్తం కుల గణన చేపడుతామని హామీ ఇచ్చారు.
దారుణం.. ఇద్దరు కుమారుల గొంతు కోసి, ఆత్మహత్యకు యత్నించిన తండ్రి.. అసలేం జరిగిందంటే ?
undefined
ఈ సభలో కుల సర్వే, రైతులకు రూ.2 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, 10 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాజస్థాన్ ఎన్నికల కోసం రూపొందించిన మేనిఫెస్టోలో కూడా కుల గణన అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. బీహార్ లో నిర్వహించిన తరహాలో రాష్ట్రంలోనూ కుల సర్వే చేపడతామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గతంలో చెప్పారు.
ఇటీవల ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలోనూ రాహుల్ గాంధీ కుల గణన అంశాన్ని ప్రస్తావించారు. దళితులు, గిరిజనలు, ఓబీసీలు తమ వాస్తవ జనాభా అంటే ఏంటో తెలుసుకున్న రోజే దేశం శాశ్వతంగా మారుతుందని చెప్పారు. ప్రధానిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘‘రూ.12,000 కోట్ల విలువైన విమానంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణిస్తూ.. ప్రతీ రోజూ కొత్త బట్టలు ధరిస్తారు. ఓబీసీ అనే పదాన్ని ఉపయోగించి ఆయన ఎన్నికయ్యారు. అయితే ఓబీసీలకు హక్కులు ఇచ్చే సమయం వచ్చినప్పుడు, భారతదేశంలో ఓబీసీ లేదని, పేదలు మాత్రమే కులమని చెప్పారు’’ అని అన్నారు.
తెలంగాణలో రైతులకు బ్యాడ్ న్యూస్.. నిధుల విడుదలకు అడ్డు చెప్పిన ఎలక్షన్ కమిషన్
‘‘ఓబీసీలు ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటాం. నరేంద్ర మోడీ కుల గణన చేపట్టినా, చేపట్టకపోయినా ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజే ఇక్కడ కుల సర్వే మొదలవుతుంది. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే కుల గణన కోసమే తొలి ఉత్తర్వులు జారీ చేస్తాం’’ అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. స్వాతంత్య్రానంతరం ఇదే అతిపెద్ద విప్లవాత్మక నిర్ణయమన్నాని చెప్పారు.