ఈద్ రోజున మసీదు వెలుపల ప్రార్థనలు చేశారని యూపీలో అలీగఢ్ పోలీసులు దాదాపు 2 వేల మందిపై అభియోగాలు మోపారు. వీరంతా నిబంధనలు ఉల్లంఘించి మత ప్రార్థనలు చేశారని పోలీసులు తెలిపారు.
గత వారం దేశ వ్యాప్తంగా ముస్లింలు ఈద్ పండగ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అయితే యూపీలోని అలీగఢ్ లో ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఈద్ సందర్భంగా పాతబస్తీ ప్రాంతంలోని రెండు మసీదుల వెలుపల నమాజ్ చేసిన పలువురు గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మసీదుల వెలుపల రోడ్లపై ప్రార్థనలు చేయడానికి ఎవరినీ అనుమతించబోమని ఈద్ కు ముందే మతపెద్దలు జిల్లా అధికారులకు హామీ ఇచ్చారని నగర సూపరింటెండెంట్ పోలీస్ కుల్దీప్ సింగ్ గునావత్ మీడియాకు తెలిపారని ‘ఎన్డీటీవీ’ నివేదించింది. అయినా నిబంధనలు పాటించకుండా, మత పెద్దల హామీలు ఉన్నప్పటికీ ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈద్గా మైదానం వెలుపల, కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో మసీదు వెలుపల రోడ్డుపై పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రార్థనలు చేశారని ఆయన పేర్కొన్నారు. అందుకే ఏప్రిల్ 26న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఎస్పీ చెప్పారు.
కర్ణాటకలో తమకు మద్దతుగా ప్రచారం చేయాలని కమల్ హాసన్‌కు కాంగ్రెస్ విజ్ఞప్తి!
కాగా.. ఇలా నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించేందుకు పోలీసులు వీడియో ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మూడు ఎఫ్ఐఆర్ లలో ఇలాంటి ఆరోపణలపై 2,000 మందికి పైగా కేసులు నమోదు చేసినట్లు కాన్పూర్ పోలీసులు పేర్కొన్నారు.