Cartoonist Narayan Debnath: లెజెండ‌రీ కార్టూనిస్ట్ నారాయణ్ దేబ్‌నాథ్ ఇక‌లేరు

By Rajesh KFirst Published Jan 18, 2022, 11:58 AM IST
Highlights

Cartoonist Narayan Debnath:  లెజెండ‌రీ కార్టూనిస్ట్, బెంగాలీ కామిక్స్ కథానాయకుడు నారాయణ్ దేబ్‌నాథ్ క‌న్నుమూశారు. ఆయన కొన్నేళ్లుగా  గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్ర‌మంలో దక్షిణ కోల్‌కతాలోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10:15 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. 
 
ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం..  ప్రముఖ కార్టూనిస్ట్ నారాయణ్ దేబ్‌నాథ్ గ‌త కొన్నాళ్లుగా  గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయ‌న డిసెంబర్ 24న పరిస్థితి విషమించ‌డంతో ఆస్ప‌తిలో చేరారు. ఊపిరితిత్తుల నుంచి కిడ్నీ సమస్యలు తీవ్ర‌మ‌య్యాయి.  అదే స‌మ‌యంలో రక్తపోటు తీవ్రంతో జనవరి 17 న అతనిని వెంటిలేషన్ లో పెట్టారు. ఈ క్ర‌మంలో హార్ట్ అటాక్ రావ‌డంతో చిక్సిత పొందుతూ మ‌ర‌ణించార‌ని వైద్యులు తెలిపారు.
  
 నారాయణ్ దేబ్‌నాథ్ 1925లో హౌరాలోని శిబ్‌పూర్‌లో జన్మించారు. చిన్నప్పటి నుంచి కళల పట్ల ఆసక్తి కనబరిచేవారు. వారిది న‌గ‌లు త‌యారీ చేసే కుటుంబం దీంతో నారాయణ్ దేబ్‌నాథ్ మొదటి నుండి నగల డిజైన్‌లను తయారు చేసేవారు. చదువు పూర్తయ్యాక ఆర్ట్ కాలేజీలో చేర్పించారు. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్ట్ కాలేజీలో చదువు మానేశాడు. ఆ తర్వాత కొన్ని అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీల్లో పనిచేశాడు.

 నారాయణ్ దేబ్‌నాథ్ 'బతుల్ ది గ్రేట్', 'హండా భోండా', 'నాంటే ఫోంటే', 'బహదూర్ బెరల్' వంటి కాల్పనిక పాత్రలను ప్రాణం పోశారు. ఆయ‌న సేవల‌కు గానూ  2013లో సాహిత్య అకాడమీ అవార్డు, బంగాభూషణ్ అవార్డులు అందుకున్నారు. అలాగే ఆయ‌న ప్ర‌తిభ‌ను మెచ్చి కేంద్రం 2021లో పద్మశ్రీ తో గౌర‌వించింది.  నారాయణ్ దేబ్‌నాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.

click me!