భారత్‌పై కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి అరిందమ్ బాగ్చి గట్టి కౌంటర్ ఇచ్చారు . ఉగ్రవాదులకు కెనడా సురక్షితమైన స్వర్గధామంగా మారుతోందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ స్థాయిలో కలకలం రేపింది. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణించంది. ఇప్పటికే ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించగా.. ఇవాళ కెనడా వాసులకు వీసా జారీ ప్రక్రియను భారత్ నిలిపివేసింది. అలాగే కెనడాలో వున్న భారతీయులు అప్రమత్తంగా వుండాలంటూ ట్రావెల్ అడ్వైజరీని కూడా జారీ చేసింది. తాజాగా గురువారం జరిగిన మీడియా సమావేశంలో కెనడాపై విరుచుకుపడ్డారు భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చి. నిజ్జర్ హత్య, తదితర పరిణామాలపై ట్రూడో చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమని ఆయన పేర్కొన్నారు.
| MEA Spokesperson Arindam Bagchi says, "If you're talking about reputational issues and reputational damage, if there's any country that needs to look at this, I think it is Canada and its growing reputation as a place, as a safe haven for terrorists, for extremists, and… pic.twitter.com/F2LZGTJ6b9
— ANI (@ANI)
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారతీయ ఏజెంట్లకు మధ్య వున్న సంబంధం వున్నట్లు ట్రూడో చేసిన ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లేవని బాగ్చి అన్నారు. కెనడియన్లకు వీసాల సస్పెన్స్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. భద్రతా సమస్యల కారణంగా, అక్కడి సేవలకు ఆటంకం ఏర్పడినందున కెనడాలోని భారత హైకమీషన్ , కాన్సులేట్‌లు తాత్కాలికంగా వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయలేకపోయాయని అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు.
ఉగ్రవాదులకు కెనడా సురక్షితమైన స్వర్గధామంగా మారుతోందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదులు, వ్యవస్థీకృత నేరాల కోసం అంతర్జాతీయ ఖ్యాతి విషయంలో ఆ దేశం ఆందోళన చెందుతోందన్నారు. మరోవైపు.. కెనడాతో దౌత్యపరమైన వివాదంపై భారత్ తన ప్రధాన మిత్రదేశాలకు తన అభిప్రాయాలను తెలియజేసిందా అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు బాగ్చి అవును అని సమాధానం ఇచ్చారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడాకు వెళ్లాలనుకునే భారతీయులు, ఇప్పటికే కెనడాలో వున్న విద్యార్ధులు, పౌరులు జాగ్రత్తగా వుండాలని అరిందమ్ బాగ్చి సూచించారు.
| "We are willing to look at any specific information that is provided to us, but so far we have received no specific information from Canada. From our side, specific evidence about criminal activities by individuals based on the Canadian soil has been shared with Canada… pic.twitter.com/1rdHyXlLS7
— ANI (@ANI)
ఇవాళ తెల్లవారుజామున భారత్ వచ్చే కెనడా పౌరులకు న్యూఢిల్లీ వీసా సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. నివేదికల ప్రకారం ఖలిస్తానీ టెర్రర్ గ్రూపుపలు, సోషల్ మీడియా నుంచి వచ్చే బెదిరింపుల నుంచి వారిని రక్షించడానికి ఒట్టావాలోని దౌత్య సిబ్బందిని తగ్గించాలని భారత్ ఆదేశించింది. కెనడాలో వీసా దరఖాస్తు కేంద్రాలను నిర్వహిస్తున్న బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ వీసా జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో కోవిడ్ 19 సమయంలో కెనడియన్లకు భారత్ వీసా సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.