పుట్టింటి నుంచి భార్య రావట్లేదని భర్త మనస్తాపం, ఆత్మహత్య

Published : Sep 21, 2023, 04:43 PM IST
పుట్టింటి నుంచి భార్య రావట్లేదని భర్త మనస్తాపం, ఆత్మహత్య

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో రాజేశ్ అనే వ్యక్తికి మద్యానికి బానిసయ్యాడు. పలుమార్లు వాదించినా ఫలితం లేకపోవడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ముగ్గురు సంతానంతో భర్త మిగిలిపోయాడు. భార్యను తిరిగి రావాలని ప్రాధేయపడ్డా ఆమె రాకపోవడంతో మద్యం సేవించడం మరింత పెంచాడు. మనస్తాపంతో ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  

లక్నో: భార్య పుట్టింటి నుంచి తిరిగి రావడం లేదని భర్త మనస్తాపానికి గురయ్యాడు. ఎంత బ్రతిమిలాడినా, సర్ది చెప్పినా ఆమె వినిపించుకోలేదు. దీంతో మద్యం తాగడం మరింత పెంచాడు. ఓ రోజు ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరాయ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ మేరకు యూపీ పోలీసులు గురువారం వెల్లడించారు.

32 ఏళ్ల రాజేశ్‌కు మద్యం అలవాటు ఉన్నది. తరుచూ మద్యం సేవించేవాడు. ఇది ఆయన భార్యకు అస్సలు నచ్చేది కాదు. మద్యం మానుకోవాలని పలుమార్లు ఆమె భర్త రాజేశ్‌కు సూచించింది. అడ్డుకుంది కూడా. ఈ విషయమై వారిద్దరి చాలా సార్లు గొడవలు జరిగాయి. ఓ సారి గొడవ పెద్దదయింది. రాజేశ్ భార్య.. వారి ముగ్గురు పిల్లలను ఆయన వద్దే వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది.

ఆ తర్వాత రాజేశ్ తన భార్యను బ్రతిమిలాడాడు. తిరిగి తన వద్దకు వచ్చేయాలని ప్రాధేయపడ్డాడు. కానీ, ఆమె నిరాకరించింది. ఆమె నిరాకరిస్తుండటంతో రాజేశ్ మద్యాన్ని మరింత ఎక్కువగా సేవించడం మొదలు పెట్టాడు. ఓ రోజు ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: బుర్ఖా బ్యాన్ చేసిన దేశాల సరసన స్విట్జర్లాండ్.. ఉల్లంఘిస్తే భారీ జరిమానా

సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు వచ్చేశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. రాజేశ్‌కు మద్యం సేవించడం అలవాటు ఉన్నదని, భార్య పలుమార్లు వారించినా ఖాతరు చేయలేదని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకి సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్ | Praggnanandhaa Meet Cm Vijay
India's Wettest Village: 365 రోజులూ వర్షం పడే ఇండియన్ విలేజ్.. అక్కడ గొడుగులు ఎందుకు వాడరో తెలిస్తే షాక్ అవుతారు !