బైజూస్ ఇన్వెస్టర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బైజూస్ ఎడ్ టెక్‌ను స్థాపించిన, ప్రస్తుతం సీఈవోగా బాధ్యతల్లో ఉన్న బైజూస్ రవీంద్రన్‌ను షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఆయనను సీఈవో పదవి నుంచి తొలగించాలని ఓటేశారు.
బైజూస్ ఇన్వెస్టర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బైజూస్ ప్రస్తుత సీఈవో బైజూ రవీంద్రన్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని ఓటు వేశారు. బోర్డు నుంచి బైజూ రవీంద్రన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా తొలగించాలని షేర్ హోల్డర్లు ఓటు వేశారు. ఎక్స్‌ట్రార్డినరీ జనరల్ మీటింగ్‌లో ఈ ఓటింగ్ జరిగింది. ఈ విషయాన్ని షేర్ హోల్డర్ ప్రోసస్ వెల్లడించింది.
బైజూస్‌లో ప్రోసస్ ఎన్‌వీ, పీక్ ఎక్స్‌వీ పార్టనర్లు. ఈ రెండే బైజూస్‌లో అతిపెద్ద పెట్టుబడిదారులు. శుక్రవారం జరిగిన ఈ భేటీలో రవీంద్రన్‌ను బైజూస్ సీఈవోగా తొలగిపోవాలని ఓటు వేశారు. బైజూస్ రవీంద్రన్ ఈ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఈ బైజూస్‌కు సీఈవోగా బాధ్యతల్లో ఉన్నారు.
undefined
కాగా, పై ప్రకటనను ఖండిస్తూ బైజూస్ మరో ప్రకటన వెలువరించింది. ఎక్స్‌ట్రార్డినరీ జనరల్ మీటింగ్‌లో కొందరు చిన్న చిన్న షేర్ హోల్డర్లు మాత్రమే హాజరయ్యారని, వారి నిర్ణయాలు చెల్లవని, అమలు కావని స్పష్టం చేసింది.
Also Read: పేటీఎం విజ్ఞప్తిని ఆర్బీఐ మన్నించినట్టేనా? ఆర్బీఐ ఆదేశాలివే
కరోనా సమయంలో పిల్లలు అందరూ ఇంటి వద్దే ఉండటం, స్కూల్స్‌ను మూసివేయడంతో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 2015లో స్థాపించిన ఎడ్‌టెక్ బైజూస్ కొత్త పుంతలు తొక్కింది. అనతి కాలంలోనే అతిపెద్ద సంస్థగా మారింది. ఒకసారి 22 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. కానీ, ఈ వాస్తవం ఎప్పటికీ నిలవలేకపోయింది. కరోనా మహమ్మారి సద్దుమణగడంతో స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. విద్యార్థులు స్కూల్స్, కాలేజీలకు వెళ్లిపోయారు. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ గణనీయంగా పడిపోయింది. కానీ, అప్పటికే భారీ కలలు కన్న బైజూస్ క్షేత్రస్థాయిలో జరుగుతున్న మార్పులను ఖాతరు చేయలేదు. దీంతో ఇప్పుడు నష్టాల్లో మునిగింది. స్టాఫ్‌కు జీతాలు చెల్లించడానికి విద్యార్థుల పేరెంట్స్‌ను పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించినట్టు వార్తలు వచ్చాయి. ఫీజులు పెంచింది. దీంతో అప్పటి వరకు ఉన్న బైజూస్ పేరుపై.. క్రమంగా నీలినీడలు కమ్ముకున్నాయి. స్టాఫ్‌కు జీతాల కోసం బైజూస్ రవీంద్రన్, ఆయన కుటుంబానికి చెందిన ఇళ్లు అమ్మేసినట్టు వార్తలు వచ్చాయి.