బులంద్‌షహర్ అల్లర్లు: ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను చంపింది జవానా..?

By sivanagaprasad kodatiFirst Published Dec 7, 2018, 2:10 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గో సంరక్షకుల చేతిలో హత్యకు గురైన ఇన్‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ కీలక మలుపు తిరిగింది. అల్లర్లు జరుగుతున్నాయని సమాచారం ఇచ్చిన యోగేశ్ రాజే ఇన్‌స్పెక్టర్‌పై కాల్పులు జరిపాడని పోలీసులు ఇప్పటి వరకు అనుమానించారు

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గో సంరక్షకుల చేతిలో హత్యకు గురైన ఇన్‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ కీలక మలుపు తిరిగింది. అల్లర్లు జరుగుతున్నాయని సమాచారం ఇచ్చిన యోగేశ్ రాజే ఇన్‌స్పెక్టర్‌పై కాల్పులు జరిపాడని పోలీసులు ఇప్పటి వరకు అనుమానించారు.

అయితే.. ఈ కేసులో జమ్మూకశ్మీర్‌కు చెందిన జవాను పేరు వినిపిస్తోంది. శ్రీనగర్‌కు చెందిన ఫ్యూజీ అనే సైనికుడు సుబోధ్‌పై కాల్పులు జరిపి అనంతరం కశ్మీర్‌కు వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. బులంద్‌షహర్‌లో అల్లర్లకు సంబంధించి కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.

ఈ వీడియోల్లో తమను చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులను వెంబడిస్తూ వారి దగ్గర నుంచి తుపాకీలు లాక్కొని వారిని చంపేయండి అని అరుస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. పదునైన ఆయుధంతో సుబోధ్‌పై దాడి చేసి ఆ తర్వాత తలపై కాల్చి చంపారు.

సుబోధ్ చనిపోయిన సమయంలో జీతు అతని ఎదురుగానే ఉన్నట్లు ఓ వీడియోలో కనిపిస్తోంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకునేందుకు రెండు పోలీసు బృందాలు జమ్మూకశ్మీర్‌కు వెళ్లారు. ఇదిలా ఉంటే సుబోధ్ హత్య వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘర్షణల్లో సుమిత్ అనే యువకుడు మరణించడంతో.. అందుకు ప్రతీకారంగానే సుబోధ్‌పై దాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. మరోవైపు కశ్మీర్ జవాను జీతు తల్లి మాత్రం తన కొడుకు పోలీస్‌ను హత్య చేశాడంటే నమ్మలేనని అంటున్నారు.

ఒకవేళ తన బిడ్డ ఇన్‌స్పెక్టర్‌ను చంపివుంటే.. అతడిని కఠినంగా శిక్షించాలని కోరారు. బులంద్‌షహర్‌ జిల్లాలోని మహవ్ ప్రాంతంలో ఒక మతానికి చెందిన కొందరు వ్యక్తులు గోవును చంపారని పోలీసులకు సమాచారం అందింది..

వారు ఘటనాస్థలికి వచ్చే లోపు... గ్రామంలో అల్లర్లు చోటుచేసుకుని ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు..

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు.. పోలీసులపైకి రాళ్లు రువ్వారు, వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. కొందరు నిరసనకారులు కూడా కాల్పులు జరపడంతో.. ఇన్‌‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు.

బులంద్‌షహార్‌ అల్లర్లు: రోడ్డుకు ఇన్‌స్పెక్టర్ సుబోధ్ పేరు

బులంద్‌షహర్‌లో ఇన్‌‌స్పెక్టర్ హత్య... ఐదుగురి అరెస్ట్

ఉత్తర ప్రదేశ్ లో చెలరేగిన హింస...నిరసనకారుల దాడిలో ఎస్సై మృతి (వీడియో)
 

click me!