రాజస్థాన్‌లో ముగిసిన పోలింగ్: 72 శాతం ఓటింగ్

By sivanagaprasad KodatiFirst Published Dec 7, 2018, 12:11 PM IST
Highlights

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 199 స్థానాల్లో పోలింగ్ ముగిసేనాటికి 72.7 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ స్వల్ప ఉద్రిక్తలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 199 స్థానాల్లో పోలింగ్ ముగిసేనాటికి 72.7 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లో నిల్చొన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తామని అధికారులు తెలిపారు.రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ స్వల్ప ఉద్రిక్తలు మినహా ప్రశాంతంగా ముగిసింది.

రాష్ట్రవ్యాప్తంగా 199 స్థానాల్లో పోలింగ్ ముగిసేనాటికి 72.7 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లో నిల్చొన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తామని అధికారులు తెలిపారు.

అత్యధికంగా పోఖ్రాన్ జిల్లాలో 71.29 శాతం, జైసల్మీర్‌లో 70.31 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. జలోర్, కోటా నార్త్, జోధ్‌పూర్, అజ్మేర్ నార్త్ నియోజకవర్గాల్లో అత్యల్ప పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 2,274 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 11న తేలనుంది. 

ఫతేపూర్‌లోని సుభాష్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుంది. దీంతో వారు వాహనాలకు నిప్పుపెట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఆందోళన కారణంగా సుమారు 30 నిమిషాల పాటు ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. 

జలోర్ నియోజకవర్గంలోని అహోర్‌లో రెండు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి.. దీంతో ఓటర్లు అసహనానికి గురై అధికారులతో వాగ్వివాదానికి దిగడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

బికనీర్ జిల్లా కొలయాత్ నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఒక వర్గానికి చెందిన వారు కారుకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారుల్ని చెదరగొడుతున్నారు. 

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 200 స్థానాలనున్న రాజస్థాన్‌ శాసనసభలో... రామ్‌గఢ్ బీఎస్పీ అభ్యర్థి మరణించడంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికను వాయిదా వేశారు.

మిగిలిన 199 అసెంబ్లీ స్థానాల్లో 2,274 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా... వీరిలో 189 మంది మహిళలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తొలిసారిగా మహిళల కోసం 200 పింక్ బూత్‌లను ఏర్పాటు చేశారు.

click me!