జల్సాల కోసం ప్రేమజంట దారుణం...స్నేహితురాలి హత్య

By Arun Kumar PFirst Published Apr 12, 2019, 8:13 PM IST
Highlights

వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇద్దరి మనసులు కలవడంతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నారు. అయితే జీవితంలో ఇంకా సెటిల్ కాకుండానే పెళ్ళి చేసుకుంటే ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని ముందుగానే గుర్తించారు. అలాగని జల్సాలను మానుకుని ఏదైనా ఉద్యోగాలు చేసి జీవించాలని అనుకోలేదు. షాట్ కట్ లో ఒక్కసారే డబ్బులు సంపాదించి కలిసి జల్సాగా జీవించాలనుకున్నారు. అలా అడ్డదారుల్లో డబ్బులు పొందాలని ప్రయత్నించి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. ఈ దుర్ఘటన  డిల్లీలో చోటుచేసుకుంది. 

ఈ హత్యోదంతానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డిల్లీలో నివాసమముండే సుమిత్, రిచా ప్రేమికులు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వీరిద్దరు జల్సాలకు అలవాటుపడ్డారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుని మిగతా జీవితాన్ని కూడా ఇలాగే గడపాలంటే భారీ మొత్తంలో డబ్బులు అవసరమని భావించారు. అలా డబ్బులు సంపాదించడం కోసం బాగా డబ్బున్న వారి ఇంట్లో ఒకే ఒక దొంగతనం చేసి లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకున్నారు.

ఇలా వారిద్దరికి తెలిసిన  గీతా సక్సెనా అనే యువతి ఇంటిని వారి తల్లిదండ్రులు లేని సమయంలో దోచుకోవాలని ప్లాన్ వేశారు. ప్లాన్ లో భాగంగా గీత ఇంట్లో ఎవరూ లేని సమయంలో వీరిద్దరితో మరో ఇద్దరు దుండగులను వెంట తెచ్చుకున్నారు. ఇలా ఇంట్లోకి చొరబడి గీతను అత్యంత దారుణంగా హతమార్చి  ఆమైపై ఒంటిపై వున్న నగలతో పాటు ఇంట్లోని నగలు, నగదు దోచుకుని పరారయ్యారు. 

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు గీత స్నేహితుల గురించి ఆరా తీయగా రీచా, సందీప్ పేర్లు బయటపడ్డాయి. ఈ హత్య జరిగినప్పటి నుండి వారిద్దరు కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు గాలింపు చేపట్టారు. ఇలా ప్రేమికులిద్దరిని పట్టుకుని తమదైన శైలిలో విచారించిన పోలీసులు అసలు నిజాన్ని కక్కించారు. హత్యకు సహకరించిన మిగతా ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. 
 
click me!