Caste: కాబోయే భర్త ఇంటిలో నవవధువు మృతి.. తక్కువ కులం అని చంపేశారు: యువతి తల్లిదండ్రులు

By Mahesh K  |  First Published Nov 20, 2023, 7:03 PM IST

కర్ణాటకలో పెళ్లి తంతు మొదలైన తర్వాత వధువు విగత జీవై కనిపించింది. ఉరి తాడుకు వేలాడుతూ కనిపించింది. పెళ్లికి ఆమె తల్లిదండ్రులు రావొద్దని, భవిష్యత్‌లో కూడా కలువొద్దని వరుడి కుటుంబ సభ్యులు కండీషన్ పెట్టారు. తన బిడ్డ దళిత కుటుంబానికి చెందినామె కాబట్టి చంపేశారని ఆమె తండ్రి ఆరోపించారు.
 


బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాబోయే భర్త ఇంటిలో యువతి శవమై కనిపించింది. ఆత్మహత్య చేసుకున్నదని అనుమానాలు వస్తున్నాయి. అయితే, ఆమెను కులం కారణంగానే వారు చంపేశారని యువతి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని విజయనగర జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం ఐశ్వర్య, అశోక్ కుమార్‌లు పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ మంచి చదువులు చదివారు. మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఐశ్వర్య దళిత సామాజిక వర్గానికి చెందిన యువతి. అదే అశోక్ కుమార్ గౌండర్ సామాజిక వర్గానికి చెందిన యువకుడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అశోక్ కుమార్ కుటుంబం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

Latest Videos

ఈ పెళ్లి జరగదని, ఒక వేళ జరిగినా నీవు అక్కడ సంతోషంగా ఉండలేవని ఐశ్వర్య తల్లిదండ్రులు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, పెళ్లికి తల్లిదండ్రులను ఐశ్వర్య ఒప్పించగలిగింది. ఆ తర్వాత అశోక్ కుమార్ కూడా వారి కుటుంబాన్ని ఒప్పించాడు. కానీ, ఆయన తల్లిదండ్రులు కఠినమైన షరతులు పెట్టారు. పెళ్లి చేసుకుంటే భవిష్యత్‌లో ఐశ్వర్య కుటుంబ సభ్యులు మళ్లీ తమ కుటుంబంలో జోక్యం చేసుకోరాదని, సంబంధం లేకుండానే ఉండాలని కండీషన్ పెట్టారు. అంతేకాదు, పెళ్లికి కూడా ఐశ్వర్య కుటుంబ సభ్యులు ఎవరూ రావొద్దని షరతు పెట్టారు. ఇందుకు ఐశ్వర్య కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. వీరి పెళ్లి నవంబర్ 23వ తేదీన ఫిక్స్ అయింది.

Also Read: Crime News: గడ్డివాములో ప్రియుడితో భార్య సరసాలు.. సజీవంగా దహనం చేసిన భర్త: పోలీసులు

పెళ్లికి ముందు జరగాల్సిన తంతు కూడా మొదలైంది. ఇందులో ఐశ్వర్య కూడా పాల్గొంది. కానీ, సోమవారం ఆమె ఉరి తాడుకు వేలాడుతూ కనిపించింది. ఆమెను మూడు నాలుగు హాస్పిటల్స్ తీసుకెళ్లిన తర్వాత రెండు గంటలు గడిచాక తమకు సమాచారం ఇచ్చారని ఐశ్వర్య తండ్రి సుబ్రమణి ఆరోపించారు. ఈ ఘటనపై సరైన దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ బిడ్డ దళిత కమ్యూనిటీకి చెందిన యువతి కాబట్టి హత్య చేశారని ఆరోపించారు.

click me!