బెంగళూరులో కరెంట్ షాక్ తో మహిళ, తొమ్మిదినెలల చిన్నారి మృతి.. ఐదుగురు అధికారులు సస్పెండ్

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి 23 ఏళ్ల మహిళ, ఆమె తొమ్మిది నెలల కుమార్తె బలయ్యారు. ఆదివారం ఈ విషాద ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. 


బెంగళూరులో విద్యుదాఘాతంతో తల్లి, కూతురు మృతి చెందడంతో బెంగుళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (బెస్కామ్) నిర్లక్ష్యానికి కారణమైన ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది. ఇద్దరు సీనియర్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఆదివారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో.. 23 ఏళ్ల సౌందర్య, ఆమె తొమ్మిది నెలల కుమార్తె లీల, హోప్ ఫామ్ సిగ్నల్ వద్ద ఫుట్‌పాత్‌పై పడి ఉన్న లైవ్ 11 కెవి వైర్‌ తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ఘోర ప్రమాదంపై దృష్టి సారించిన కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్ సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

Latest Videos

Maharashtra Earthquake : మహారాష్ట్రలోని హింగోలిలో భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలోనూ ప్రకంపనలు..

విద్యుత్‌ సరఫరా విభాగంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సుబ్రమణ్య టి, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ చేతన్‌ ఎస్‌, జూనియర్‌ ఇంజినీర్‌ రాజన్న, జూనియర్‌ పవర్‌మెన్‌ మంజునాథ్‌ రేవణ్ణ, లైన్‌మెన్‌ బసవరాజులపై బెస్కామ్‌ ఆదివారం సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ అంశంపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు.

ఈస్ట్‌సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ లోకేష్‌బాబు, వైట్‌ఫీల్డ్‌ డివిజన్‌ ​​ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శ్రీరాములుకు నగర విద్యుత్‌ బోర్డు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి మూడు రోజుల్లోగా తమ స్పందనను తెలియజేయాలని కోరింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది.
 

click me!