Shanti Dhariwal : ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాజస్థాన్ మంత్రి శాంతి కుమార్ ధరివాల్ కు కోటా మహిళల నుంచి వ్యతిరేకత ఏర్పడింది. ఇటీవల ఆయన చేసిన ‘అత్యాచారం’ వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో స్థానిక మహిళలు నిరసన వ్యక్తం చేశారు.
రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. నాయకులు తమ నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే పలు చోట్ల నాయకులకు చేదు అనుభవాలు ఎదురువుతున్నాయి. వారిని స్థానికులు అడ్డుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్ మంత్రి శాంతికుమార్ ధరివాల్ కు ఎలాంటి అనుభవమే ఎదురైంది.
కోటాలో ప్రచారం చేసేందుకు వెళ్లిన ఆయనను పలువురు మహిళలు అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ నేత, అధికార ప్రతినిధి షాజాద్ జైహింద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయన ట్వీట్ ప్రకారం.. అందులో మహిళలు తమకు డబ్బులు వద్దనీ.. న్యాయం, గౌరవం కావాలని చెబుతున్నారు. మంత్రి ఇచ్చిన రూ.25000లను తిరిగి ఆయనకే ఇచ్చేశారు. ఆయనకు గట్టిగా ఎదురు తిరిగారు.
Women of Rajasthan oppose Shanti Dhariwal; return money; demand justice & respect
कोटा के कुन्हाड़ी में जनसंपर्क के दौरान धारीवाल जी द्वारा महिला को ₹25000 दिए गए परंतु महिला ने रुपए लौटा दिये । महिलाओं को यह पैसे नहीं सम्मान और न्याय चाहिए । धारीवाल वही है जिसने बलात्कार को… pic.twitter.com/i91ZWQ2MdE
స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఒకరు ఆ మహిళలను సముదాయించేందుకు ప్రయత్నించారు. కానీ మహిళలు శాంతించలేదు. కాగా.. కుమార్ శాంతి ధరివాల్ ఇటీవల వార్తల్లో నిలిచారు. ఆయన మహిళలపై అత్యాచారాన్ని వ్యతిరేకిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే మహిళల నుంచి ఆయనకు వ్యతిరేకత వచ్చిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా.. గెహ్లాట్ ప్రభుత్వంలో శాంతికుమార్ ధరివాల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఈ సారి కోటా నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. ఆయన కోసం ఇటీవల సీఎం అశోక్ కుమార్ గెహ్లాట్ బహిరంగ సభ నిర్వహించారు. దీంతో పాటు రోడ్ షో కూడా చేపట్టారు. ఇదే సమయంలో ఆయన అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.