12 అడుగుల కోబ్రాని చేతితో పట్టుకొని, ముద్దులు..!

Published : May 16, 2023, 08:06 AM IST
  12 అడుగుల కోబ్రాని చేతితో పట్టుకొని, ముద్దులు..!

సారాంశం

 కొందరికైతే దానిని దూరం నుంచి చూసినా గుండె ఆగిపోతది. అలాంటి పాముని ఓ కుర్రాడు ఎడమ చేతితో పట్టుకున్నాడు. 

అంత దూరాన పాము కనపడితేనే దాదాపు అందరం భయంతో వణికిపోతూ ఉంటాం. అలాంటిది ఓ కుర్రాడు ఏకంగా పామును పట్టుకొని ఆటలాడాడు. అది అలాంటి, ఇలాంటి పాము కూడా కాదు. ఆ పాము ఏకంగా 12 అడుగులు ఉంది. అందులోనూ ప్రపంచలోనే అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా అది. అలాంటి పామును పట్టుకొని ఆటలాడాడు.

ఆ పాముని ఫోటోలో  చూస్తే కూడా భయం కలిగేలా ఉంది. ఒక మనిషి పొడవుకు రెండింతల ఎత్తు, దానికి తగిన లావు, చూడటానికే భయం కల్పించేలా ఉంది. కొందరికైతే దానిని దూరం నుంచి చూసినా గుండె ఆగిపోతది. అలాంటి పాముని ఓ కుర్రాడు ఎడమ చేతితో పట్టుకున్నాడు. 

 

వీడియోలో పాము పడగ విప్పి ఇంతెత్తున లేచి ఉండటం చూడొచ్చు. ఈ పాముకు ఎదురుగా ఓ వ్యక్తి ఉన్నాడు. అతను పామును ఎడమ చేత్తో పట్టుకుని ఉన్నాడు. కొంచెం కూడా భయపడకుండా, అతను పామును పట్టుకున్న తీరుకు అందరూ షాకైపోతున్నారు. పామను పట్టుకోవడంతో ఆగలేదు. దానికి ముద్దు కూడా పెట్టాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడీయాలో వైరల్ గా మారింది. nicthewrangler అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ వీడియోని షేర్ చేయగా, దానిని చూసి నెటిజన్లు షాకైపోతున్నారు. అసలు కొంచెం కూడా భయం లేకుండా ఎలా బ్రో అంటూ ప్రశ్నిస్తున్నారు. అతని ధైర్యానికి ఫిదా అయిపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీడియోపై ఓ కన్నేయండి.

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?