మోడీ కేబినెట్‌లో కీలక మార్పులు: ఆర్ధిక శాఖ నుంచి నిర్మల ఔట్.. కొత్త విత్త మంత్రి ఈయనేనా..?

By Siva KodatiFirst Published Jun 4, 2020, 7:16 PM IST
Highlights

కేంద్ర మంత్రి వర్గంలో మార్పుల జరగబోతున్నాయా..? అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. ప్రధాని మోడీ కొన్నాళ్లుగా కేబినెట్‌లో మార్పులు, చేర్పులపై దృష్టి సారించినట్లుగా కథనాలు వినిపిస్తున్నాయి.

కేంద్ర మంత్రి వర్గంలో మార్పుల జరగబోతున్నాయా..? అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. ప్రధాని మోడీ కొన్నాళ్లుగా కేబినెట్‌లో మార్పులు, చేర్పులపై దృష్టి సారించినట్లుగా కథనాలు వినిపిస్తున్నాయి.

ఆర్ధిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌ను మార్చి.. ఆ పదవిని బ్రిక్స్ కూటమి బ్యాంక్స్ ఛైర్మన్‌గా పనిచేస్తున్న కేవీ. కామత్‌కు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. సరిగ్గా పనిచేయని మంత్రులను పదవుల నుంచి తప్పించి, కొత్తవారికి చాన్స్ ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లుగా సమాచారం.

Also Read:కేంద్ర కొత్త ఆర్థిక శాఖ మంత్రిగా కే.వీ.కామత్‌..?

ఇప్పటికే మంత్రుల పనితీరు, వారి శాఖలపై తన సన్నిహితులతో కలిసి సమీక్ష జరిపిన మోడీ కొత్త వారి చేరిక, ఇప్పటికే కేబినెట్‌లో వున్న వారి శాఖల మార్పులపై ఓ నిర్ణయానికి కూడా వచ్చి వుండొచ్చిన బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆర్ధిక శాఖే కాకుండా మరికొన్ని ముఖ్య శాఖల్లోనూ మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. బ్రిక్స్ కూటమి బ్యాంక్స్ ఛైర్మన్‌గా వున్న కేవీ. కామత్ కేంద్ర మంత్రివర్గంలో చేరుతారని ఆయనతో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్ గుప్తాకు కూడా మంత్రివర్గంలో బెర్త్ ఖరారైనట్లుగా తెలుస్తోంది. 

click me!