మారటోరియం సమయంలో ఈఎంఈలపై వడ్డీ వసూలు చేయడంపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గురువారం నాడు నోటీసులు జారీ చేసింది. మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
న్యూఢిల్లీ: మారటోరియం సమయంలో ఈఎంఈలపై వడ్డీ వసూలు చేయడంపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గురువారం నాడు నోటీసులు జారీ చేసింది. మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. మారటోరియం సమయంలో రుణ వాయిదాలపై వడ్డీ రద్దుతో బ్యాంకుల ఆర్ధిక పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతుందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆర్బీఐ పేర్కొంది.
also read:ఇండియాలో ఒక్క రోజులోనే అత్యధికంగా 9,304 కరోనా కేసులు: మొత్తం 2,16,919కి చేరిక
లాక్ డౌన్ సమయంలో ఈఎంఐలపై మారటోరియం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. తొలుత మూడు మాసాల పాటు మారటోరియం విధించింది. ఆ తర్వాత మరో మూడు మాసాలపాటు మారటోరియాన్ని పొడిగించిన విషయం తెలిసిందే.
ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయకపోవడం, వడ్డీపై వడ్డీ విధించకపోవడం పరిశీలించాలని కోరింది. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ఇది తీవ్రంగా చర్చించాల్సిన అంశమన్నారు.
మారటోరియం ఇచ్చినా కూడ వడ్డీ భారం వేయడం సరైంది కాదని పిటిషనర్ గజేంద్ర శర్మ కోర్టును కోరారు. ఈ విషయమై అఫిడవిట్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టును కోరారు.ఈ విషయమై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది.