లంచంగా ‘మంచం’ కోరుకున్నా నేరమే.. అవినీతి చట్టానికి సవరణలు

By sivanagaprasad KodatiFirst Published 10, Sep 2018, 10:19 AM IST
Highlights

ప్రభుత్వోద్యోగులు లంచం రూపంలో మంచం కోరుకున్నా అది అవినీతి కిందకే వస్తుందని అవినీతి నిరోధక సవరణల చట్టం-2018 స్పష్టం చేస్తోంది. 1998 నాటి అవినీతి నిరోధక చట్టంలో అవినీతి అంటే.. ప్రభుత్వ పరంగా ఏదైనా పనిని ఒకరికి అనుకూలంగా చేసి పెట్టినందుకు ప్రభుత్వోద్యోగి నగదు రూపంలో లబ్ధిపొందడాన్ని అవినీతిగా పేర్కొంది.

అయితే నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాకా 2015లో ఈ చట్టానికి సవరణలు చేయాల్సిందిగా లా కమిషన్‌కు బాధ్యతలు అప్పగించారు. కమిషన్ సూచనల ఆధారంగా 2016లో పార్లమెంట్‌లో అవినీతి చట్టానికి సవరణల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం లభించిన తర్వాత ఈ ఏడాది జూలైలో రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

తాజా సవరణల ప్రకారం ఒకరికి అనుకూలంగా పనిచేసేందుకు ప్రభుత్వోద్యోగులు, అధికారులు అందుకు ప్రతిగా స్థిర, చరాస్తుల కొనుగోళ్లలో డౌన్ పేమెంట్లు పొందినా.. బంధుమిత్రులకు ఉద్యోగం వచ్చేలా చేసినా....విలువైన బహుమతులను స్వీకరించినా అవన్నీ అవినీతి కిందకే వస్తాయి. ఇందుకు ఏడేళ్ల దాకా జైలు శిక్ష విధిస్తారు.

Last Updated 19, Sep 2018, 9:17 AM IST