Modi 3.0 Oath Ceremony: మోడీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..? 

By Rajesh Karampoori  |  First Published Jun 6, 2024, 4:06 PM IST

Modi 3.0 Oath Ceremony: కేంద్రంలో మరో మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సార్వత్రిక ఎన్నికలు 2024 లో ఏన్డీయే కూటమి  హ్యాట్రిక్‌ విజయం సాధించింది. దీంతో వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే.. ఆయన ప్రమాణ స్వీకారం ఎప్పుడనే ఉత్కంఠ మాత్రం మొదలైంది. 


Modi 3.0 Oath Ceremony: కేంద్రంలో మరో మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సార్వత్రిక ఎన్నికలు 2024 లో ఏన్డీయే కూటమి హ్యాట్రిక్‌ విజయం సాధించింది. దీంతో వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే.. ఆయన ప్రమాణ స్వీకారం ఎప్పుడనే ఉత్కంఠ మాత్రం మొదలైంది.

తొలుత జూన్‌ 8న శనివారం మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే జూన్‌ 9న ఆదివారం సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం మారినట్లు సమాచారం. దేశంలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని మోదీ చేపట్టనున్నారు.

Latest Videos

ప్రమాణస్వీకారోత్సవానికి ముందు బుధవారం మోదీ తన రాజీనామా లేఖను అధ్యక్షుడు ముర్ముకు సమర్పించారు. రాష్ట్రపతి నరేంద్ర మోడీ, ఆయన మంత్రుల రాజీనామా లేఖను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు నరేంద్రమోడీని తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగాలని అభ్యర్థించారు.

కూటమి నాయకుడిగా మోదీ 

ఒక రోజు ముందు.. NDA తన నాయకుడిగా నరేంద్ర మోడీని ఏకగ్రీవంగా అంగీకరించింది. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో 21 మంది ఎన్డీయే నేతలు మోదీని తమ నాయకుడిగా అంగీకరిస్తూ లేఖపై సంతకాలు చేశారు. దీంతో నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడానికి మార్గం సుగమమైంది. ఈ సమావేశంలో నాయకులందరూ కూడా ప్రధాని మోదీ గత 10 సంవత్సరాలలో దేశంలో చేసిన అభివృద్ధి పనులకు అభినందనలు తెలిపారు. 

భారత ఎన్నికల సంఘం మంగళవారం లోక్‌సభ 2024 ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. ఇందులో బీజేపీ అత్యధికంగా 240 సీట్లు సాధించగా, కాంగ్రెస్‌ 99 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే గత సారితో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు కోల్పోయింది. 2014 తర్వాత బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడం ఇదే తొలిసారి.

ముఖ్య అతిథులు వీరే.. 

ప్రమాణ స్వీకారోత్సవానికి మోడీ ఎవరిని ఆహ్వానించారు? బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో కూడా మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఫోన్ సంభాషణ సందర్భంగా మోదీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని హసీనాను ఆహ్వానించారని, అందుకు ఆమె అంగీకరించారని దౌత్య వర్గాలు తెలిపాయి. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ 'ప్రచండ', భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్‌లను కూడా ఆహ్వానించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికారికంగా గురువారం ఆహ్వానాలు పంపనున్నట్లు తెలుస్తోంది. 
 
ప్రమాణస్వీకార కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది?

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రధాని మోదీ 3.0 ప్రమాణ స్వీకారం జూన్ 9 న రాష్ట్రపతి భవన్ ముందు జరిగే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారోత్సవాన్ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి భవన్‌లో ఒక రౌండ్‌ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో ఇంకా అధికారిక ధృవీకరణ లేదు..  

click me!