ఎగ్జిట్ పోల్స్‌తో 30 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ స్కాం.. కాంగ్రెస్ ఆరోపణలు.. బీజేపీ దిమ్మతిరిగే కౌంటర్..

By Rajesh Karampoori  |  First Published Jun 6, 2024, 9:04 PM IST

Rahul Gandhi- Stock Market: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు రోజులు కూడా కాలేదు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షాపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేస్తుంది. ఎగ్జిట్ పోల్ పేరిట భారతదేశంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణానికి తెర తీశారని సంచలన ఆరోపణలు చేశారు.


Rahul Gandhi: సార్వత్రిక ఎన్నికల సమరం ఇలా ముగిసిందో లేదో బీజేపీపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షాపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల ఫలితాలు రాకముందే బీజేపీ ఎగ్జిట్ పోల్‌ను చూపిస్తూ ఏకపక్ష విజయాన్ని అందుకుంటామని కుట్ర చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని, హోంమంత్రి, ఆయన కోసం పనిచేస్తున్న ఎగ్జిట్ పోల్‌స్టర్లు, స్నేహపూర్వక మీడియాతో కలిసి భారత్‌లోనే అతిపెద్ద 'స్టాక్ మార్కెట్ స్కామ్' చేసేందుకు కుట్ర పన్నారని కాంగ్రెస్ నేత అన్నారు. ఈ కుట్ర వల్ల 5 కోట్ల చిన్న పెట్టుబడిదారుల కుటుంబాలకు చెందిన 30 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ స్కామ్ పై జెపిసిని ఏర్పాటు చేసి ఈ 'క్రిమినల్ యాక్ట్'పై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. 

మోదీ హయంలో పెట్టుబడుల ప్రవాహాం: పీయూష్ గోయల్ 

Latest Videos

రాహుల్ గాంధీ చేసిన సంచలన ఆరోపణలపై బిజెపికి సీనియర్ నేత పీయూష్ గోయల్ స్పందించారు. రాహుల్ గాంధీ ఎన్నికల ఓటమిని భరించలేకపోయారని, అందుకే 'స్టాక్ మార్కెట్ స్కాం' అంటూ ఆరోపణలకు తెగబగ్గారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ తన 10 సంవత్సరాల్లో ఎన్నో విజయాలను సాధించారని గుర్తు చేశారు. తద్వార భారత్ లోకి ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయనీ, అలాగే.. ఎంతో భారతీయ పెట్టుబడిదారులు కూడా ప్రయోజనం పొందారని పీయూష్ గోయల్ అన్నారు. ఈ రోజు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూడటానికి కారణమిదేననీ, దేశ ప్రజలకు మోడీపై విశ్వాసం ఉందని అన్నారు. నేడు భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందనీ,  నేడు ప్రపంచం మొత్తం భారత్‌ను అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అంగీకరిస్తోందని తెలియజేశారు. నరేంద్ర మోడీ తన మూడో టర్మ్‌లో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, మోదీ దేశానికి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మోదీ మూడోసారి అధికారంలోకి రావడంతో రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే.. ఆయన (రాహుల్ గాంధీ) తన ప్రకటనలతో విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులను గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారు.

రాహుల్ వ్యాఖ్యలను  తిప్పికొట్టిన బీజేపీ

రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. నిజం ఏమిటంటే..  మే 31, 2024 (ముగింపు) నుండి జూన్ 6, 2024 (ముగింపు) వరకు బిఎస్‌ఇ సెన్సెక్స్ 1149.96 పాయింట్లు పెరిగిందని, ఇది 1.55% జంప్ అని పేర్కొంది. కాబట్టి పెట్టుబడిదారులు గత 4 రోజుల్లో మార్కెట్ నుండి దాదాపు రూ. 7.5 ట్రిలియన్లు సంపాదించారు. నిజానికి సెన్సెక్స్ గత 5 ఏళ్లలో దాదాపు రెట్టింపు (89.5% పెరిగింది). సెన్సెక్స్ 2019లో 39000 నుంచి 2024లో 75000కి పెరిగింది. సుమారు 14% CAGR చేరింది. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మూడో టర్మ్‌ను స్టాక్ మార్కెట్ జరుపుకోవడంతో గత రెండు సెషన్లలో (జూన్ 5, 6) బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 2,995 పాయింట్లు కోలుకుంది. అలాగే నిఫ్టీ మంగళవారం నుంచి 937 పాయింట్లు పెరిగింది. జూన్ 4న 72,079 వద్ద ముగిసిన సెన్సెక్స్ గురువారం 75,074 వద్ద ముగిసింది. మంగళవారం 21,884 వద్ద ముగిసిన నిఫ్టీ నేడు 22,821 వద్ద ముగిసింది. రెండు సెషన్లలో సెన్సెక్స్ 3,000 పాయింట్లు పెరగడంతో ఇన్వెస్టర్లు రూ.21 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు.  

స్టాక్ మార్కెట్ లో లావాదేవీలు జరిగినప్పుడు లాభాలు,నష్టాలు సంభవిస్తాయి.లేకుంటే అది సంపద సృష్టి ప్రయత్నాలకు సంబంధించినది. రాహుల్ గాంధీ ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా మార్కెట్‌లో ఎఫ్‌ఐఐ ప్రవాహం ఆగిపోవాలని, రిటైల్ ఇన్వెస్టర్లు సంపద సృష్టించే ప్రయత్నాలు ఆపాలని కోరుతున్నారు. ఇంతకు ముందు కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఉండే వారు ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్ల కలలను నాశనం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని బీజేపీ ఆగ్రహం చేసింది.

click me!