బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలతో ఐదుగురికి పునర్జన్మ

Published : Jul 21, 2022, 03:05 AM IST
బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలతో ఐదుగురికి పునర్జన్మ

సారాంశం

తమిళనాడుకు చెందిన ఓ 19 ఏళ్ల యువకుడు యాక్సిడెంట్‌తో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్య చికిత్సలు అందించినప్పటికీ మళ్లీ సాధారణ స్థితికి రాలేదు. అతని బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు ప్రకటించారు. అనంతరం, ఆ యువకుడి అవయవాలు దానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఈ నిర్ణయంతో ఐదుగురికి పునర్జన్మ దక్కింది.  

చెన్నై: తమిళనాడులో ఓ యువకుడు యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్ తీసుకెళ్లినా ఆయన కోలుకోలేడు. యువకుడి బ్రెయిన్ ఇనాక్టివ్ లేదా డెడ్ అయిందని వైద్యులు డిక్లేర్ చేశారు. అదే సమయంలో కొంత మంది యాక్టివిస్టులు అవయవ దానం గురించి ఆ కుటుంబానికి తెలిపారు. వారు అందుకే సరే అని అంగీకరించారు. ఆ యువకుడి అవయవాలతో ఐదుగురికి పునర్జన్మ దక్కింది.

చెన్నైకి చెందిన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ జీఎస్టీ రోడ్డులో నగర శివారులో ఈ నెలలోనే యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ఆ 19 ఏళ్ల యువకుడిని వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. కానీ, మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు చెన్నైలోని రేలా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. 

ఆ హాస్పిటల్‌లో మంచి వైద్యం అందినప్పటికీ ఆ యువకుడిని మళ్లీ సాధారణ స్థితికి తేలేకపోయారు. వైద్యులు ఆ యువకుడి బ్రెయిన్ డెడ్ అయినట్టు వివరించారు. అయితే, ఆయన దేహంలోని అవయవాలు సరిగానే పని చేస్తున్నాయి. దీంతో కొందరు సోషల్ వర్కర్స్ ఆ కుటుంబాన్ని చేరి అవయవ దానం గురించి వివరించారు. వారు ఆ యువకుడి అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే అందుకు అనుమతి ఇచ్చింది.

ఆ యువకుడి ఒక కిడ్నీ, గుండెను ఇద్దరు పేషెంట్లకు ట్రాన్స్‌ప్లాంట్ చేశారని ఓ ప్రకటనలో తెలిపారు. మరో కిడ్నీని, రెండు శ్వాసకోశలను, లివర్‌ను ఇతర పేషెంట్లకు అమర్చినట్టు ఆ ప్రకటన పేర్కొంది.

ట్రాన్స్‌ప్లాంట్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు(ట్రాన్స్‌టాన్) మెంబర్ సెక్రెటరీ ఆర్ కాంతిమథి మాట్లాడుతూ, ప్రతి ప్రాణం విలువైనదేననని, ప్రతి ఒక్కరికీ ఇక్కడ జీవించే హక్కు ఉన్నదని తమ ట్రాన్స్‌టాన్ నమ్ముతుందని వివరించారు. దేశంలో అవయవదానాలు చేయించడంలో తమిళనాడులో అగ్రశ్రేణిలో ఉన్నదని గర్వంగా చెప్పగలనని తెలిపారు. ఆ యువకుడి కుటుంబ సభ్యులను ఆయన ప్రశంసించారు.

మరణించిన యువకుడి సోదరి మాట్లాడుతూ, తన సోదరుడు కూడా ఇదే కోరుకుని ఉంటాడని చెప్పింది. తన సోదరుడు వ్యక్తిగతంగా ఏదీ ఆశించడని, ఇతరులకు సహాయం చేయడంలో సంతోషాన్ని వెతుక్కునే వాడని తెలిపింది. ఇతరుకుల సహాయం చేయడానికి ఎక్కడా వెనుకాడేవాడు కాదని పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?