
న్యూఢిల్లీ: ప్రముఖ సింగర్, ర్యాపర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసే వాలాను పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో దారుణంగా హత్యగావించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సిద్దూ మూసే వాలా హంతకులు మొత్తం 8 మంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సిద్దూ మూసే వాలాపై ఫస్ట్ షాట్ చేసిన హంతకుడు సహా మరో నిందితుడికి, పంజాబ్ పోలీసులకు మధ్య నాలుగు గంటలకుపై కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు దుండగులు అక్కడికక్కడే మరణించారు.
నాలుగు గంటలకు పైగా సాగిన ఎన్‌కౌంటర్‌ను కవర్ చేయడానికి స్పాట్‌కు ఓ న్యూస్ చానెల్ కెమెరా పర్సన్ వెళ్లారు. కానీ, ఆ కాల్పుల్లో ఈ చానెల్ కెమరామ్యాన్ కాలికి బుల్లెట్ పడింది. అమృత్ సర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో బాక్నా గ్రామంలో అగ్రహారంతో వెళ్లిపోయింది. ఘటనా స్థలిలో ఒక ఏకే - 47, పిస్టల్ సహా పెద్ద సంఖ్యలో బుల్లెట్లు లభించాయని ఏడీజీపీ ప్రమోద్ బాన్ వెల్లడించారు.
సుమారు మిట్ట మధ్యాహ్పం 12 గంటల ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ మొదలైంది. ఈ ఇద్దరి వ్యక్తులను పోలీసులు నిఘా పెట్టింది. అయితే, సిద్దూ మూసేవాలాను చంపేసినట్టుగా భావిస్తున్న ముగ్గురిలో ఇద్దరే వీరు. ఈ ఇద్దరు మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ మన్ను కుస్సా, జగరూప్ సింగ్ అలియాస్ రూపలను పోలీసులు కొంత కాలంగా ట్రాక్ చేస్తున్నారు. ఈ రోజు వారు పాకిస్తాన్ బార్డర్‌కు సుమారు 10 కిలోమీటర్ల సమీపంలో వారు దాక్కున్నారు. పోలీసులు వారిని లొంగిపోవాలని అభ్యర్థించారు. కానీ, వారు అందుకు నిరాకరించారు. ఒకరి వెంట మరొకరు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులు చేపట్టకతప్పలేదు. మొదటి వ్యక్తి చనిపోయిన తర్వాత సుమారు గంట తర్వాత ఇంకొకరిని పోలీసులు మట్టుబెట్టారు. పోలీసులు బుల్లెట్ గాయాల పాలయ్యారు.