మహిళా పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్య.. బండిమీద వెడుతుంటే తుపాకీతో కాల్పులు.. ప్రియుడే హంతకుడు..

Published : Feb 10, 2023, 02:13 PM IST
మహిళా పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్య.. బండిమీద వెడుతుంటే తుపాకీతో కాల్పులు.. ప్రియుడే హంతకుడు..

సారాంశం

ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. బైక్‌పై వెళ్తున్న మహిళను మోటార్‌సైకిల్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

బీహార్‌ : బీహార్‌లోని కతిహార్ జిల్లాలో బుధవారం ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్‌ హత్యకు గురయ్యింది. ఇంటికి తిరిగి వస్తున్న మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన కతిహార్ జిల్లా సమీపంలోని భట్వారా పంచాయతీ భవన్ సమీపంలో ఎన్ హెచ్ 81లో రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగింది. ఆ మహిళ ముంగేర్ జిల్లా వాసి.

ఘటనా స్థలం నుంచి రెండు ఖాళీ కాట్రిడ్జ్‌లు, మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. బైక్‌పై వెళ్తున్న మహిళను మోటార్‌సైకిల్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మహిళను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

దేశంలో 4 లక్షలకు పైగా పెండింగ్ లో అండర్ ట్రయల్ ఖైదీల కేసులు

“మేము ఇంకా దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉన్నాం. దీనిపై విచారణ జరుపుతాం' అని కతిహార్‌ ఎస్పీ జితేంద్ర కుమార్‌ తెలిపారు. డాగ్ స్క్వాడ్‌తో పాటు ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని కేసుకు సంబంధించిన వివరాలు సేకరించినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) బృందాన్ని కూడా కతిహార్‌కు పంపినట్లు అధికారి తెలిపారు.

మృతురాలు ప్రభకుమారి అనే మహిళా కానిస్టేబుల్ తన తల్లిదండ్రులతో కలిసి భట్వారా గ్రామంలో ఉంటోంది. కాగా, ప్రభకుమారికి చోటు అలియాస్ అర్షద్ అనే వ్యక్తితో ప్రేమవ్యవహారం ఉండేది. అయితే, గత కొద్ది రోజులగా ప్రభకుమారి అర్షద్ ను దూరం పెడుతోంది. దీంతో కోపానికి వచ్చిన అతను ఆమెను చంపేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. చాలాసార్లు ఫోన్లు చేసి ఈ మేరకు బెదిరింపులకు పాల్పడ్డాడని ప్రభకుమారి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ప్రభకుమారిని హత్య చేశాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, పశ్చిమ ఢిల్లీలోని కీర్తి నగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ భవనంలో గురువారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. రమేష్ నగర్‌లోని ఓ భవనంలోని రెండో అంతస్తులో మధ్యాహ్నం 3.31 గంటలకు జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది.

వారు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి, ఒక వ్యక్తి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించగా, ఒక మహిళ మంచంపై చనిపోయి, విగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) ఘనశ్యామ్ బన్సాల్ తెలిపారు.

మృతులను విజయ్ కుమార్ (28), ఆంచల్ (25)గా గుర్తించారు. వీరిద్దరూ పటేల్ నగర్, ఆనంద్ పర్బత్ ప్రాంత నివాసితులని.. వీరిద్దరూ ఒకరికొకరు చాలా సంవత్సరాలుగా పరిచయం అని పోలీసులు తెలిపారు. కుమార్ జిమ్ ట్రైనర్. కాగా, ఆంచల్ కెనడాలో చదువుతోంది. ఈ హత్యలకు సంబంధించి దర్యాప్తులో భాగంగా క్రైమ్, ఫోరెన్సిక్ బృందాలను ఘటనా స్థలానికి పిలిపించినట్లు బన్సల్ తెలిపారు.

కీర్తినగర్ పోలీస్ స్టేషన్‌లో ప్రాథమికంగా హత్య కేసుగా ఇది నమోదైంది. సీసీటీవీ ఫుటేజీ, కాల్‌ రికార్డుల వివరాలు, శవపరీక్ష నివేదికలను విశ్లేషిస్తామని పోలీసులు చెప్పారు. అయితే, మహిళ శరీరంపై ఎలాంటి గాయాల గుర్తులు కనిపించలేదు. దీంతో పోస్ట్‌మార్టం నివేదికలో మృతికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించి, శుక్రవారం పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. కుమార్ ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. మహిళ జనవరిలో ఢిల్లీకి వచ్చింది. కానీ, ఆమె వచ్చిన సంగతి ఆమె కుటుంబ సభ్యులకు తెలియదు. దీంతో వీరిద్దరూ కోర్టులో వివాహం చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు