
న్యూఢిల్లీ: వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసినందుకు గాను బీబీసీపై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఇండియా-ది మోడీ క్వశ్చన్ పేరిట బీబీసీ డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను మెరిట్ లేని అభ్యర్ధనగా పేర్కొంది.
హిందూసేన ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. పిటిషనర్ తరపున పింకీ ఆనంద్ వాదనలు విన్పించారు. అయితే పూర్తి సెన్సార్ షిప్ పెట్టాలని మీరు కోరుకుంటున్నారని పిటిషనర్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్ ను కోర్టు తప్పుబట్టింది.
హిందూసేన అధ్యక్షుడు విష్ణు గుప్తా ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. భారత దేశానికి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీబీసీ వ్యవహరిస్తుందని పిటిషనర్ ఆరోపించారు. బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ మోడీకి వ్యతిరేకంగా ఉద్దేశించిబడిందని ఆయన ఆరోపించారు.
2002 లో గుజరాత్ లో జరిగిన అల్లర్లకు సంబంధించి బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారింది. మోడీ ప్రతిస్టను దిగజార్చే ఉద్దేశ్యంతో ఈ డాక్యుమెంటరీని రూపొందించారని పిటిషనర్ ఆరోపించారు.
ఈ డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారింది. ఈ డాక్యుమెంటరీని సోషల్ మీడియా ఫ్లాట్ ఫారాల్లో నిషేధం విధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది. దీంతో విపక్షాలు కేంద్రం తీరుపైవిపక్షాలు మండిపడ్డాయి.ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ దేశంలోని పలు రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించిన విషయం తెలిసిందే . ఈ సందర్భంగా కేసులు కూడా నమోదయ్యాయి.