చంద్రయాన్ -2 సక్సెస్: ఇస్రో చైర్మెన్ శివన్

By narsimha lodeFirst Published Jul 22, 2019, 3:16 PM IST
Highlights

చంద్రయాన్ -2 విజయవంతం కావడం పట్ల ఇస్రో చైర్మెన్ శివన్ సంతోషం వ్యక్తం చేశారు. దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
 


నెల్లూరు:  చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైందని  ఇస్రో చైర్మెన్ శివన్ ప్రకటించారు. ఈ ప్రయోగంతో స్పేస్ చరిత్రలో ఇండియా చరిత్ర సృష్టించిందని ఆయన ప్రకటించారు.

సోమవారం నాడు చంద్రయాన్-2 ప్రయోగం తర్వాత ఇస్రో చైర్మెన్ శివన్ మీడియాతో మాట్లాడారు. చంద్రయాన్ -2 విజయవంతం వెనుక ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. తమ కుటుంబాలను కూడ వదిలి ఈ ప్రయోగం సక్సెస్ కోసం ప్రయత్నించారని ఆయన గుర్తు చేసుకొన్నారు.

చంద్రయాన్-2 ప్రయోగం సక్సెస్ కావడం వెనుక ఉన్న ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఏడాదిన్నర నుండి శాటిలైట్ టీమ్ చంద్రయాన్ -2 కోసం ప్రయత్నాలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.

ఏడాదిన్నరగా శాటిలైట్ టీమ్ విశ్రాంతి లేకుండా పనిచేశారని ఆయన చెప్పారు.సాంకేతిక సమస్యలను అధిగమించినట్టుగా ఇస్రో చైర్మెన్ శివన్ ప్రకటించారు.సమస్యను గుర్తించిన వారంలోనే పరిష్కరాన్ని కనుగొన్నట్టుగా ఆయన చెప్పారు.ఇస్రో టీమ్ అహర్నిశలు శ్రమించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. శాస్త్రవేత్తల అంకితభావం, కృషి చంద్రయాన్ -2 సక్సెస్ కావడానికి కారణంగా నిలిచాయని శివన్ అభిప్రాయపడ్డారు.

ఇది ఆరంభం మాత్రమేనని శివన్ చెప్పారు. వచ్చే 45 రోజులు అత్యంత కీలకమైనవిగా శివన్  తెలిపారు. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి చంద్రుడిపై ల్యాండర్ దిగుతుందని ఇస్రో చైర్మెన్ శివన్ ప్రకటించారు.ల్యాండర్ దిగిన తర్వాత యాత్ర పూర్తి కానుందని  శివన్  తెలిపారు.

సంబంధిత వార్తలు

నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2

నేడే చంద్రయాన్-2: అందరి దృష్టి ఇస్రోపైనే

రేపే చంద్రయాన్-2: నేటి నుంచే కౌంట్ డౌన్

click me!