బోరిస్ జాన్సన్ ఇండియా టూర్: కలోనియల్ ఘటనపై క్షమాపణకై డిమాండ్

Published : Apr 21, 2022, 10:39 AM ISTUpdated : Apr 21, 2022, 10:40 AM IST
 బోరిస్ జాన్సన్ ఇండియా టూర్: కలోనియల్  ఘటనపై క్షమాపణకై డిమాండ్

సారాంశం

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటనకు గురువారం నాడు ఇండియాకు వచ్చారు. అయితే కలోనియల్ ఘటనపై ఆయన క్షమాపణ చెప్పాలని గుజరాత్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

న్యూఢిల్లీ:వందేళ్ల క్రితం జరిగిన Colonial-Era Massacre ఘటనపై Britan ప్రధాని బోరిస్ జాన్సన్ క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు విన్పిస్తున్నాయి. రెండు రోజుల ఇండియా పర్యటనకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం నాడు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కి చేరుకొన్నారు.

బ్రిటిషన్ పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై  కాల్పులు జరిపిన ఘటనలో సుమారు 1200 మంది మరణించారు.  ఈ ఘటన జరిగి వందేళ్లు పూర్తైంది. ఈ మారణకాండపై బ్రిటన్ ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు విన్పిస్తున్నాయి. గత నెలలో పాల్ దధ్వాన్ హత్యాకాండకు వందేళ్లు పూర్తయ్యాయి. దోపీడీ, బలవంతపు శ్రమ, అధిక పన్నులకు వ్యతిరేకంగా సంఘ సంస్కర్త మోతీలాల్ తేజావత్ నేతృత్వంలో రెండు వందల మంది గిరిజనులు చరిత్రకారులు చెబుతున్నారు.

 బ్రిటిష్ మేజర్ హెచ్ జీ సుట్టన్  కాల్పులు జరపాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈ ప్రాంతమంతా యుద్ధభూమిలా మారిందని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కాల్పులతో చనిపోయిన వారి శవాలతో రెండు బావులు నిండిపోయాయని తెలిపింది. ఈ ఏడాది జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ హత్యలను ఆదీవాసీల శౌర్యం, త్యాగాలకు ప్రతీకగా చెబుతుంది.ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 1200 మరణించారని ప్రభుత్వం ెలిపింది. 

ఈ హత్యలు బ్రిటిష్ పాలనలో జరిగినందున దేశంలో పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని  Boris Johnson  ఇక్కడికి వచ్చిన సమయంలో ఈ ఘటనపై క్షమాపణ చెప్పాలని Tejavath మనమడు Mahendra మీడియాకు చెప్పారు. మా తాత పేద, నిరక్షరాస్యులైన గిరిజనుల కోసం పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రక్షణ లేని గిరిజనులకు జరిగింది తప్పు అని భావిస్తే బోరిస్ జాన్సన్ విచారం వ్యక్తం చేయాలని తేజావత్ మనమడు డిమాండ్ చేశారు.

ప్రధాని Narendra Modi  భారతదేశ జాతీయ గుర్తింపులో స్వాతంత్ర్య పోరాటాన్ని ఒక ముఖ్యమైన అంశంగా నొక్కి చెబుతారు. స్వాతంత్ర్య నాయకుల భారీ విగ్రహాలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఎర్రకోటలో ఓక మ్యూజియాన్ని కూడా నిర్మించింది.  గుజరాత్ సీఎంగా మోడీ ఉన్న సమయంలో ఈ ఊచకోత  ఘటన బాధితులకు స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు.

ఈ విషయమై బ్రిటిష్ ప్రధాని గుజరాత్ వాసులు ఆశించినట్టుగా చేస్ారని భావించడం లేదని Gujarat యూనివర్శిటీ చరిత్ర విభాగం అధిపతి అరుణ్ వాఘేలా అభిప్రాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఆయన పరిశోధనలు చేశారు. ఘటన ప్రాంతంలో 20 ఏళ్ల క్రితం బుల్లెట్లు, లోతైన బావుల్లో ఆస్థిపంజరాలు కనుగొన్నట్టుగా చెప్పారు. బ్రిటిష్ రికార్డుల ప్రకారం ఈ ఘటనలో 40 నుండి 50 మంది మాత్రమే చనిపోయారని చెబుతున్నాయి.  వాఘేలా చెబుతున్న ప్రకారంగా 1919లో అమృత్ సర్ లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ కంటే 379 మంది నుండి 1000 మంది మరణించారు.  రాష్ట్రంలోని విప్లవాత్మక ప్రదేశాలపై గుజరాతీ భాషలో జర్నలిస్ట్ విష్ణు పాండ్య పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో అనేక జానపద పాటలలో వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !