ఇండియాలో రెండు రోజుల టూర్‌కి బోరిస్ జాన్సన్: రేపు మోడీతో భేటీ కానున్న బ్రిటన్ ప్రధాని

Published : Apr 21, 2022, 10:00 AM IST
 ఇండియాలో రెండు రోజుల  టూర్‌కి బోరిస్ జాన్సన్: రేపు మోడీతో భేటీ కానున్న బ్రిటన్ ప్రధాని

సారాంశం

రెండు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ గురువారం నాడు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కి చేరుకున్నారు. రేపు ప్రధాని మోడీతో బోరిస్ జాన్సన్ భేటీ కానున్నారు.

న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని Boris Johnson  గురువారం నాడు Gujarat రాష్ట్రంలోని Ahmedabad కి  చేరుకున్నారు. రెండు రోజుల పాటు బోరిస్ జాన్సన్ రెండు రోజుల పాటు India లో పర్యటిస్తారు. రేపు ప్రధాని Narendra Modi తో బోరిస్ జాన్సన్ సమావేశం కానున్నారు. వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై బోరిస్ జాన్సన్  , మోడీలు చర్చించనున్నారు. ఇండి

పత్రిభావంతులైన  వ్యక్తులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని బోరిస్ జాన్సన్ చెప్పారు. ఇండియాకు వచ్చే సమయంలో విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Ukraine  పై Russia మిలటరీ  ఆపరేషన్ విషయంలో ఐక్యరాజ్యసమితిలో ఇండియా తటస్థ వైఖరిని అవలంభించింది. అయితే ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ తర్వాత ఇండియా రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకొనేలా భారత్ ను ఒప్పించేందుకు యూకే ప్రయత్నాలు చేస్తుంది.

బోరిస్ జాన్సన్ తన ఇండియా పర్యటనలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి  అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఇండో -ఫసిఫిక్ లో సహకరానాన్ని పెంచడానికి రక్షణ సంబంధాలను మెరుగు పరుస్తుందన్నారు.  ఇవాళ గుజరాత్ లో పలువురు పారిశ్రామికవేత్తలతో బోరిస్ జాన్సన్ సమావేశాలు నిర్వహిస్తారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్తారు.

ఈ ఏడాది చివరి నాటికి స్వేచ్ఛా వాణిజ్య చర్చలను ముగించేందుకు  ఇరుపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆపిల్స్, వైద్య పరికరాలు, రొయ్యల వంటి వాటి విషయమై గతంలో జరిగిన చర్చలు దాదాపుగా  ముగింపు దశలో ఉన్నాయి. ఈ పర్యటనలో ఈ చర్చలు ఫలవంతమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండియాతో సంబంధాలకు యూకే ఇస్తున్న ప్రాధాన్యతను నొక్కి చెబుతూనే వచ్చే 25 ఏళ్ల పాటు ఈ సంబంధాలు కొనసాగేలా రెండు దేశాల మధ్య చర్చల జరిగే అవకాశం ఉంది.గత ఏడాది మే మాసంలో ప్రధాని మోడీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ లు వర్చువల్ నిర్వహించిన సమావేశంలో వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం