cold wave: దేశంలో "చలి" పిడుగులా విరుచుకుపడుతోంది. మరీ ముఖ్యంగా ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయికి పడిపోవడం.. పొగమంచు కారణంగా చలి తీవ్రత గరిష్ట స్థాయికి చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
cold wave: దేశంలో చలి తీవ్రత పెరిగింది. "చలి" పిడుగులా విరుచుకుపడుతోంది. మరీ ముఖ్యంగా ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయికి పడిపోవడం.. పొగమంచు, చలిగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత గరిష్ట స్థాయికి చేరింది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, జమ్మూకాశ్మీర్ సహా ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నిరంతరం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలికి గజగజ వణికిపోతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఇండ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. రొడ్డు పక్కల, వీధుల్లో చలి మంటలు కాచుకునే వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో పేదలు శీతాకాలపు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చలికాలం తీవ్రంగా ఉండడంతో ఆటోడ్రైవర్లు, టీ అమ్మేవారు, ఉద్యోగాలు చేసుకునే వారు చలి ప్రభావానికి గురవుతున్నారు.
Also Read: Bulli Bai: ఆన్‌లైన్ లో అమ్మకానికి అమ్మాయిలు.. యాప్‌లో ఓ వర్గం వారి ఫొటోలు.. సర్వత్రా ఆగ్రహం !
undefined
న్యూఢిల్లీలోని రామ్ లీలా గ్రౌండ్ ప్రాంతానికి చెందిన ఒక ఆటో-డ్రైవర్ మాట్లాడుతూ.. 'చలి కారణంగా ఇండ్ల నుంచి బయటకు వచ్చేవారు తగ్గిపోయారు. పొద్దునే ఎవరూ బయటకు రావడం లేదు. పొద్దుపొద్దున్న చలి చంపేసేలా ఉంది. అందుకే చలి మంటలు వేసుకుని ఇక్కడ కూర్చున్నాం. మేము ఉదయం పని కోసం బయటకు వెళ్తాము. పొగమంచు ఎక్కువగా లేదు కానీ చలిగాలులు అధికంగా వీస్తున్నాయి' అని అన్నారు. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో చలి తీవ్ర పెరుగుతున్నది. ఆదివారం తూర్పు ఉత్తరప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలలో దట్టమైన పొగమంచు అధికంగా ఉంటుంది అని పేర్కొంది. చలికాలం పరిస్థితులపై ఢిల్లీలోని పలువురు కార్మికులు మాట్లాడుతూ.. 'చలి తీవ్రతకు కాళ్లు చేతులు గడ్డ కట్టినట్లు కనిపిస్తున్నాయి. చలికాలం తీవ్రంగా ఉండటంతో చేతివేళ్లు బిగుసుకుపోతున్నాయని, కాళ్లు, చేతులు గడ్డకట్టినట్లు కనిపిస్తున్నాయని' తెలిపారు. ‘‘మేం పేదవాళ్లం, చలికాలంలో సరిపడా బట్టలు లేవు.. మేం పారిశుధ్య కార్మికులం. బట్టలు కొనడానికి డబ్బులు లేవు. ఇలా మంటలు వేసుకుని చలి కాచుకుంటాం. మా బతుకుదెరువు కోసం కష్టపడి పనిచేస్తాం. కార్మికులంతా ఇలా చలి నుంచి కాపాడుకోవడానికి మంటలు వేసుకుని కలిసి కూర్చుంటారు" అని ఓ పారిశుధ్య కార్మికుడు వెల్లడించాడు.
Also Read: up assembly elections 2022: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం: టైమ్స్ నౌ పోల్
ఉత్తరభారతంలో పాటు దక్షిణ భారతంలోనూ చలి తీవ్రత పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి క్రమంగా పెరుగుతున్నదని వాతావరణ విభాగం పేర్కొంది. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి చంపేసేలా వణుకు పుట్టిస్తోంది. రికార్డ్ స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని మాడుగులలో 8.1 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మినుములూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, పాడేరు, అరుకులలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. చలితో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో పొగ మంచ తీవ్రత అధికంగా ఉంటున్నది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. కుమురుంభీమ్ జిల్లాలోని సిర్పూర్(యు)లో 11.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే, ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 13.3, పిప్పల్ దరిలో 13.5, పెంబిలో 13.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రలు నమోదయ్యాయి.
Also Read: coronavirus:యూరప్ పై కరోనా విజృంభణ.. 100 మిలియన్లకు పైగా కేసులు