బెంగళూరులోని నేషనల్ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపు.. ఆందోళనకు గురైన విద్యార్థులు, సిబ్బంది

By team teluguFirst Published Jan 6, 2023, 4:10 PM IST
Highlights

బెంగళూర్ లోని రాజాజీనగర్ లో ఉన్న నేషనల్ పబ్లిక్ స్కూల్ కు బాంబు హెచ్చరిక వచ్చింది. దీంతో స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు అక్కడికి చేరుకొని భయపడాల్సిన అవసరం లేదని, అంతా సురక్షితంగా ఉందని చెప్పారు. 

కర్ణాటకలోని బెంగళూరులో ఓ పాఠశాలకు శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఆ ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్న సమయంలోనే అధికారులు విద్యార్థులను సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రాజాజీనగర్‌లోని నేషనల్ పబ్లిక్ స్కూల్‌ ఆవరణలో బాంబు పేలుడు జరుగుతుందని హెచ్చరిస్తూ మెయిల్ వచ్చింది. దీంతో స్పందించిన స్కూల్ యాజమాన్యం వెంటనే బసవేశ్వర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది.

ఎముక‌లు కొరికే చ‌లి.. కాన్పూర్ లో 25 మంది మృతి, పెరుగుతున్న గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కేసులు

ఈ సమయంలో అధికారులు, యాజమాన్యం విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పోలీసులతో పాటు బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్‌లు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పాఠశాలను తనిఖీ చేశారు. అయితే ఎలాంటి బాంబు బయటపడలేదు. దీంతో అంతా ఊపరి పీల్చుకున్నారు.

ఇద్దరు డాక్టర్లపై కత్తితో దాడి చేసిన పేషెంట్.. విధులను నిలిపివేసి ఆందోళనకు దిగిన డాక్టర్లు

ప్రస్తుతం పరిస్థితి అంతా సురక్షితంగా ఉందేని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్కూల్ యాజమాన్యం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఈ వ్యవహారంపై త్వరలో కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్ స్కూల్ మిడ్ డే మీల్స్ లో చికెన్, సీజనల్ ఫ్రూట్స్.. ఓట్ల కోసమే అని విమర్శించిన బీజేపీ

బాంబు బెదిరింపును ఎదుర్కొన్న నేషనల్ పబ్లిక్ స్కూల్ ను 1959లో కేపీ గోపాలకృష్ణ బెంగళూరులో స్థాపించారు. నాలుగు భవనాలతో కూడిన ఈ  క్యాంపస్.. రాజాజీనగర్‌లోని 5వ బ్లాక్‌లోని కార్డ్ రోడ్‌లో ఉంది.

కాంగ్రెస్ 70 ఏళ్ల పాటు రాజ్యాంగాన్ని కాపాడితే.. బీజేపీ మ‌తం, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తోందంటూ ఖర్గే ఫైర్

గతంలోనూ బెంగళూరు శివార్లలోని ఉన్న నాలుగు స్కూల్స్ ఇలాగే బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, బెంగళూరు ఈస్ట్, గోపాలన్ ఇంటర్నేషనల్, న్యూ అకాడమీ స్కూల్, సెయింట్ విన్సెంట్ పాల్ స్కూల్‌లకు  ఉదయం 10.15 నుండి 11 గంటల ఈ మెయిల్స్ వచ్చాయి. అందులో “ మీ పాఠశాలలో చాలా శక్తివంతమైన బాంబు అమర్చబడింది. ఇది ఒక జోక్ కాదు. వెంట‌నే పోలీసుల‌ను, సప్పర్‌లను పిలవండి. ఆల‌స్యం చేయ‌కండి. ఇప్పుడు మీతో స‌హా వంద‌లాది మంది జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి. ’’ అంటూ ఒకే కంటెంట్ రాసి ఉంది.

దీంతో స్కూళ్ల నిర్వాహ‌కులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. వెంట‌నే స్కూల్ ఆవ‌ర‌ణ‌ను ఖాళీ చేశారు. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. స్థానిక పోలీసుల‌తో పాటు బాంబ్‌ స్క్వాడ్‌లు కూడా తనిఖీలకు వెళ్లాయి. ఆ సమయంలో కూడా అక్కడ బాంబును పోలీసులు గుర్తించలేదు. 
 

click me!