Gulf Ticket : 667 మంది ఇండియన్స్ కి జాక్ పాట్

By Arun Kumar P  |  First Published Feb 27, 2024, 11:14 AM IST

కొందరు భారతీయుకులకు అదృష్టం వరించింది. గల్ఫ్ టికెట్ తాజాగా నిర్వహించిన డ్రాలో 667 మంది విజేతలుగా నిలిచారు.  


కొందరు భారతీయులు జాక్ పాట్ కొట్టారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన 'గల్ఫ్ టికెట్' లాటరీ ఫ్లాట్ ఫార్మ్ ఫార్చ్యూన్ 5 మరియు సూపర్ 6 విజేతలను ప్రకటించింది. తాజాగా నిర్వహించిన డ్రాలో మొత్తం 667 మంది AED 258,440 (దినార్స్) మొత్తం ప్రైజ్ మనీ పొందారు.  

ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే గల్ప్ టికెట్ లాటరీ ఉద్దేశమని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.ఈ లాటరీ ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షంచుకునే అవకాశం దక్కుతుందని... విజేతలుగా నిలిచేవారి కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయని తెలిపారు. తాజా డ్రా ద్వారా గల్ప్ టికెట్ మరో మైలురాయికి చేరుకుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

Latest Videos

ఈ గల్ఫ్ టికెట్ లాటరీలో తమిళనాడుకు చెందిన శ్రీధర్ శివకుమార్ ఫార్చ్యూన్ 5 గేమ్ లో 22.5 లక్షల దిర్హమ్స్ గెలుచుకున్నాడు. విజేతగా నిలిచి భారీ నగదు బహుమతి పొందిన అతడు సంబరాల్లో మునిగిపోయాడు. తాజాగా వరించిన అదృష్టంతో అతడి జీవితమే మారిపోనుంది... అతడి కుటుంబంలో ఆనందాలు నిండాయి. 
 
ఈ డ్రాలో  విజేతలుగా నిలిచినవారికి గల్ఫ్ టికెట్ చీఫ్ మార్కెటింగ్ అధికారి జొరన్ పొపొవిక్ అభినందనలు తెలిపారు. విజేతల ప్రకటన కోసం నిర్వహించిన డ్రా పోటీపడిన వారికే కాదు తమకు ఎంతో థ్రిల్ ఇచ్చిందన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఈ గల్ప్ టికెట్ లాటరీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతిఒక్కరు తమ కలలను సాకారం చేసుకునేలా ఎంతో పారదర్శకంగా, మరెంతో నమ్మకంతో పనిచేస్తున్నామని జొరాన్ తెలిపారు. 

ఇక ప్రస్తుత డ్రాలో విజయం సాధించలేకపోయినవారు నిరాశ చెందవద్దని... ఇకపై జరిగే డ్రా కోసం వేచిచూడాలని గల్ఫ్ టికెట్ సంస్థ సూచిస్తోంది. ఇంతకంటే ఎక్కువ ప్రైజ్ మనీ, మంచి అవకాశం వరిస్తుందేమోనని అన్నారు. ప్రతి ఒక్కరి కలను సాకారం చేసేందుకు గల్ప్ టికెట్ ప్రయత్నిస్తుందని తెలిపారు. ఈ గల్ఫ్ టికెట్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం www.gulfticket.com ను సంప్రదించవచ్చు. 

click me!