తమిళనాడులోని కడలూరులో బాయిలర్ పేలుడు: ఎగిసిపడుతున్న పొగ

By Siva KodatiFirst Published May 7, 2020, 7:17 PM IST
Highlights

తమిళనాడులోని ఓ ప్లాంటులో బాయిలర్ పేలిపోయింది. తమిళనాడులోని కడలూరులో గల నైవేలీ లిగ్నైట్ కార్పోరేషన్ ప్లాంటులో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఏడుగురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. 

తమిళనాడులోని ఓ ప్లాంటులో బాయిలర్ పేలిపోయింది. తమిళనాడులోని కడలూరులో గల నైవేలీ లిగ్నైట్ కార్పోరేషన్ ప్లాంటులో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఏడుగురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. 

ప్లాంట్ నుంచి పెద్ద యెత్తున పొగలు ఎగిసిపడుతున్నాయి. సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్లాంట్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. 

Also Read:ఛత్తీస్‌ఘడ్ పేపర్ మిల్లులో గ్యాస్ లీక్: ఏడుగురు కార్మికులకు అస్వస్థత

స్థానిక పోలీసులు, ఫైర్ ఫైటర్స్ ఇప్పటికే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్లాంటులో పనులను ఆపేశారు. ఎన్ఎల్సీ థర్మల్ స్టేషన్ అది.  టీపీఎస్ రెండో దశలో ఏడు యూనిట్లు ఉన్నాయి. ఒక్క యూనిట్ ఉత్పాదక సామర్థ్యం 210 యూనిట్లు. వాటిలో మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతావి మెయింటెనెన్స్ కోసం మూతపడ్డాయి. 

ప్లాంటులో దాదాపు 2 వేల మంది పనిచేస్తారు. నాలుగు యూనిట్లను మూసేయడంతో తక్కువ మంది మాత్రమే ప్లాంటులో పనిచేస్తున్నారు.

Also Read:విశాఖలో గ్యాస్ లీకేజీని సుమోటోగా తీసుకొన్న హైకోర్టు:ప్రభుత్వాలకు నోటీసులు

click me!