గుజరాత్ లో కరోనా వ్యాప్తికి 'నమస్తే ట్రంప్ ప్రోగ్రామే' కారణం: కాంగ్రెస్ ఆరోపణ

By narsimha lodeFirst Published May 7, 2020, 5:28 PM IST
Highlights

గుజరాత్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంపై నమస్తే ట్రంప్ కార్యక్రమం కూడ కారణమని  కాంగ్రెస్ పార్టీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ చావ్డా ఆరోపించారు.

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంపై నమస్తే ట్రంప్ కార్యక్రమం కూడ కారణమని  కాంగ్రెస్ పార్టీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ చావ్డా ఆరోపించారు.

దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్న రాష్ట్రాల్లో గుజరాత్ రాష్ట్రం ఒకటి. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో గుజరాత్ రాష్ట్రంలో 'నమస్తే ట్రంప్' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి లక్ష మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా కరోనా ఎక్కువ వ్యాప్తి చెందిందని ఆయన ఆరోపించారు. 

డబ్ల్యుహెచ్ఓ హెచ్చరికలను పట్టించుకోకుండా బీజేపీ లక్షల మందితో నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని నిర్వహించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వేలాది మంది గుజరాత్ కు విదేశీయులు తరలి వచ్చారని ఆయన ఆరోపించారు. విదేశీయుల ద్వారా  ఈ వైరస్ రాష్ట్రంలో వ్యాప్తి చెందిందన్నారు. 

కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ఆరోపణలను  బీజేపీ గుజరాత్ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండించింది.  బీజేపీ అధికార ప్రతినిధి ప్రశాంత్ వాలా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను ఖండించారు. అమెరికా అధ్యక్షుడు ఏ ప్రాంతంలో పర్యటించాలని భావిస్తే అమెరికాకు చెందిన ప్రత్యేక బృందం పర్యటించనుందన్నారు. సెక్యూరిటీతో పాటు ఆరోగ్య సంబంధమైన అంశాలను పరిశీలిస్తోందన్నారు. అన్ని అనుకూలంగా ఉంటేనే  అమెరికా అధ్యక్షుడి పర్యటనకు అనుమతి ఇస్తారని ఆయన తెలిపారు. 

click me!