ట్రైన్ టాయ్ లెట్ లో వ్యక్తి మృతదేహం...!

Published : Nov 01, 2022, 12:22 PM IST
ట్రైన్ టాయ్ లెట్ లో వ్యక్తి మృతదేహం...!

సారాంశం

చనిపోయిన వ్యక్తి ఎవరు అనే విషయం తెలియరాలేదు. బాత్రూమ్ లో నుంచి భరించలేని వాసన వస్తోంది అంటూ కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో.... ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

రైలులోని టాయ్ లెట్ లో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తి వయసు 30ఏళ్లు ఉన్నట్లు గుర్తించారు. జనసేనసేవా ఎక్స్ ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు.

ఉత్తరప్రదేశ్ నుంచి బిహార్ కి వెళ్తున్న రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో తాళం వేసి ఉన్న టాయ్ లెట్ లో ఈ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. చనిపోయిన వ్యక్తి ఎవరు అనే విషయం తెలియరాలేదు. బాత్రూమ్ లో నుంచి భరించలేని వాసన వస్తోంది అంటూ కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో.... ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వారి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు.. వెంటనే అక్కడకు వచ్చి బాత్రూమ్ తాళం పగలకొట్టారు. బాత్రూమ్ లో నుంచి మృతదేహాన్ని తీసిన తర్వాత... రైలు మళ్లీ అక్కడి నుంచి వెళ్లిపోయింది. చనిపోయిన వ్యక్తి శరీరంపై ఆకుపచ్చ చొక్కా,బ్లూ ట్రౌజర్ ఉన్నట్లు గుర్తించారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోవడంతో.. అతను ఎవరు అనే విషయం తెలియరాలేదని చెప్పారు. అతను చనిపోయి మూడు రోజులు అవుతోందని వైద్యులు చెప్పారు. అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. ఎలా చనిపోయాడో తెలియడం లేదని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్