బ్రాహ్మణి నదిలో పడవ బోల్తా.. 30 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు గల్లంతు..

Published : Apr 27, 2023, 09:06 AM IST
బ్రాహ్మణి నదిలో పడవ బోల్తా.. 30 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు గల్లంతు..

సారాంశం

ఒడిశాలో కేంద్రపరా జిల్లాలోని ఔల్ ప్రాంతంలో బ్రాహ్మణి నదిలో పడవ బోల్తా పడింది. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఒడిశాలో కేంద్రపరా జిల్లాలోని ఔల్ ప్రాంతంలో బ్రాహ్మణి నదిలో పడవ బోల్తా పడింది. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో 30 మంది ఉన్నట్టుగా సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. అయితే వారిలో ఒకరు మైనర్ ఉన్నారు. వివరాలు.. పడవ ఎకమానియా నుంచి రాజ్‌నగర్‌లోని కేరదాగర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎకమానియా పంచాయతీ అన్ని వైపుల నుండి నదితో చుట్టుముట్టబడి ఉంది. దీంతో అక్కడి నివాసితులు రోజువారీ రవాణా కోసం పడవలపై ఆధారపడతారు.

ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో మొదటి పడవ ఎకమానియా నుంచి బయలుదేరింది. పడవలో 30 మంది ప్రయాణికులతో పాటు, 8 నుంచి 10 బైక్‌లు ఉన్నట్టుగా చెబుతున్నారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత బోటు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతు కాగా.. వారి కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు కూడా అక్కడికి బయలుదేరారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?